మీరాబాయి చాను బయోపిక్.. త్వరలో ప్రకటన!

author img

By

Published : Jul 26, 2021, 6:58 AM IST

Updated : Jul 26, 2021, 7:13 AM IST

mirabai chanu biopic in hindi

టోక్యో ఒలింపిక్స్​లో రజత పతకం సొంతం చేసుకున్న వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్ బయోపిక్​ తెరకెక్కించేందుకు పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట! ఇందులో బాలీవుడ్​ స్టార్స్​ ఇద్దరు నటించనున్నారని సమాచారం.

టోక్యో ఒలింపిక్స్ భారత్​ తరఫున తొలి పతకం గెలుచుకున్న వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బయోపిక్​కు రంగం సిద్ధమవుతోందట! ఈ విషయమై బాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి స్టోరీలతో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్​ దగ్గర భారీ వసూళ్లనే సాధించడం వల్ల చాను బయోపిక్​కు మరింత క్రేజ్​ పెరిగింది!

ఈ సినిమా హక్కుల కోసం చిత్ర నిర్మాతలు కసరత్తులు చేస్తున్నట్లు ఇప్పటికే సోషల్​ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఇందులో కీలకమైన కోచ్ పాత్రలో అక్షయ్ కుమార్​, చానూ పాత్రలో ప్రియాంకా చోప్రా నటించనున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలి పతకం- వెయిట్​లిఫ్టింగ్​లో రజతం

Last Updated :Jul 26, 2021, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.