ETV Bharat / sitara

అపరిచితుడు రీమేక్​పై దర్శకుడు శంకర్​కు షాక్​.. హైకోర్టులో కేసు!

author img

By

Published : Aug 24, 2021, 9:52 AM IST

Updated : Aug 24, 2021, 10:20 AM IST

అన్నియన్​ రీమేక్​ (anniyan remake)​ వివాదంపై మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు నిర్మాత రవిచంద్రన్​ ప్రకటించారు. దర్శకుడు శంకర్, హిందీ రీమేక్​కు నిర్మాతైన జయంతీలాల్​ గాదాలపై కేసు వేయనున్నట్లు తెలిపారు.

anniyan remake controversy
దర్శకుడు శంకర్​కు షాక్​.. హైకోర్టులో కేసు!

'అపరిచితుడు' హిందీ రీమేక్​కు​ ఇప్పట్లో చిక్కులు వీడేలా లేవు. 2005లో విడుదలైన ఈ చిత్రాన్ని హిందీ రీమేక్​ చేయాలన్న శంకర్​ ప్రయత్నాన్ని ఆ చిత్ర నిర్మాత రవిచంద్రన్ అడ్డుకుంటున్నారు. రణ్​వీర్​ సింగ్​ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో​ 'అన్నియన్​'కు రీమేక్ (anniyan remake)​ రానుందన్న ప్రకటనను రవిచంద్రన్​ తప్పుపట్టారు. ఇప్పటికే ఈ విషయంపై సౌత్​ ఇండియన్​ ఫిల్మ్​ ఛాంబర్​ను ఆశ్రయించారు. ఈ సమస్య పరిష్కారం కోసం రవిచంద్రన్​ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కనున్నారు. దర్శకుడు శంకర్​, హిందీ రీమేక్​కు నిర్మాతైన జయంతీలాల్​ గాదాలపై మద్రాస్​ హైకోర్టులో కేసు వేయనున్నట్లు ప్రకటించారు.

"ఎస్​ఐఎఫ్​సీసీ నాకు మద్దతుగా నిలిచింది. ఈ వివాదంపై ఇప్పుడే కోర్టును ఆశ్రయించవద్దని సూచించారు. ఎస్​ఐఎఫ్​సీసీ.. ముంబయిలోని ఫిల్మ్​ అసోసియేషన్​ను కూడా సంప్రదించింది. నేను ఇప్పుడు చర్చలు జరపాల్సింది హిందీ రీమేక్​కు నిర్మాతైన గాదేజీతో కానీ శంకర్​తో కాదు."

-వి రవిచంద్రన్, అన్నియన్​ నిర్మాత

అసలు ఏంటీ గొడవ?

తమిళంలో అన్నియన్​ పేరుతో స్టార్​ దర్శకుడు శంకర్​ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. 2005లో విడుదలైన ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. తెలుగులో ఈ సినిమా 'అపరిచితుడి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ బ్లాక్​బస్టర్​ను హిందీలో రీమేక్​ చేసి పాన్​ ఇండియా సినిమాగా విడుదల చేయాలని శంకర్​ భావించారు. ఇందులో హీరోగా రణ్​వీర్​ సింగ్​ పేరు కూడా ఖరారైంది.

ఈ ప్రకటనతోనే వివాదం మొదలైంది. ఈ సినిమాపై తనకు సర్వ హక్కులు ఉన్నాయని.. తనను సంప్రదించకుండా ఈ చిత్రాన్ని ఎలా రీమేక్​ చేస్తారంటూ రవిచంద్రన్​ ప్రశ్నించారు. ఈ సినిమా కథ తనదే అని.. శంకర్​కు కేవలం దర్శకత్వం బాధ్యతలు అప్పగించినట్లు చెప్పుకొచ్చారు. రవిచంద్రన్​ వ్యాఖ్యలకు కౌంటర్​గా శంకర్​ స్పందించారు. ఈ సినిమా కథ తనదే అని.. ఆ విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో శంకర్​ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. 'భారతీయుడు- 2' సినిమా చిత్రీకరణపై నిర్మాతలు శంకర్​పై హైకోర్టులో కేసు దాఖలు చేశారు. అయితే ఆ కేసును మద్రాస్​ హైకోర్టు కొట్టివేసింది.

ఇదీ చదవండి : 'ఫిదా', 'ఉప్పెన' ఆ హీరోలతో చేయాల్సింది.. కానీ!

Last Updated :Aug 24, 2021, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.