ETV Bharat / sitara

కత్రినా కైఫ్ పెళ్లిలో అమితాబ్ బచ్చన్ స్టెప్పులు!

author img

By

Published : Jan 24, 2020, 12:48 PM IST

Updated : Feb 18, 2020, 5:35 AM IST

హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లిలో స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ దంపతులు డ్యాన్స్​ చేసి, అలరించారు. ఇదంతా నగల దుకాణానికి సంబంధించిన కొత్త వాణిజ్య ప్రకటనలో భాగంగా జరిగింది.

amitabh bachchan shake a leg with bride katrina kaif
కత్రినా కైఫ్ పెళ్లిలో అమితాబ్ బచ్చన్ డ్యాన్సులు

అగ్ర హీరోల సమక్షంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి ఘనంగా జరిగింది. అదేంటి అంత పెద్ద కథానాయిక ఎవరికి చెప్పకుండా, ఎటువంటి సమాచారం బయటకు రాకుండా వివాహం చేసుకుందా? అని ఆశ్చర్యపోతున్నారా. మరేం లేదు.. ఓ నగల దుకాణానికి సంబంధించిన ప్రకటనలో భాగంగా పై తతంగం అంతా జరిగింది.

amithab dance with katrina kaif
కత్రినా కైఫ్​తో కలిసి డ్యాన్స్​ చేస్తున్న అమితాబ్ దంపతులు

ఈ నగల దుకాణం కోసం తాజాగా కొత్త యాడ్​ను తీశారు. ఇందులో కత్రినా తల్లిదండ్రులుగా అమితాబ్ బచ్చన్ దంపతులు నటించారు. ఈ పెళ్లికి వచ్చిన ముఖ్య అతిథులుగా అక్కినేని నాగార్జున(తెలుగు), శివరాజ్​కుమార్(కన్నడ), ప్రభు(తమిళం) కనిపించారు. ఈ ప్రకటన కోసం నటి కత్రినా కైఫ్​తో కలిసి అమితాబ్ బచ్చన్ దంపతులు డ్యాన్స్​ చేయడం విశేషం. ఈ ఫొటోలు కొన్నింటిని అమితాబ్ తన ట్విట్టర్​లో పంచుకున్నారు. పలు చిత్ర పరిశ్రమలకు చెందిన ఒకప్పటి అగ్రహీరోల కుమారులతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు.

amithab with Shivraj kumar-prabhu-nagarjuna
నాగార్జున-శివ రాజ్​కుమా-ప్రభులతో అమితాబ్ దంపతులు
AP Video Delivery Log - 0400 GMT News
Friday, 24 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0323: Archive Auschwitz AP Clients Only 4250892
75 years since liberation of Auschwitz-Birkenau
AP-APTN-0306: Australia US Canadian Firefighters No access Australia 4250891
Firefighters pay tribute after plane crash kills 3
AP-APTN-0228: US Impeach Ukraine Budget AP Clients Only 4250890
Impeachment manager: 'Money mattered to Ukraine'
AP-APTN-0221: Venezuela March AP Clients Only 4250889
Maduro government supporters march in Caracas
AP-APTN-0207: Puerto Rico Protest AP Clients Only 4250888
Protesters in Puerto Rico demand governor's ouster
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 18, 2020, 5:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.