ETV Bharat / sitara

'గంగూబాయ్..' కథ విని ఆలియా పారిపోయింది: డైరెక్టర్ భన్సాలీ

author img

By

Published : Feb 17, 2022, 8:57 PM IST

Alia gangubai: 'గంగూబాయ్..' రిలీజ్​కు రెడీ అయిన నేపథ్యంలో సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పారు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ కథ విన్న మొదటిసారి ఆలియా పారిపోయిందని తెలిపారు.

Alia Bhatt Sanjay Leela Bhansali
ఆలియా భట్ సంజయ్ లీలా భన్సాలీ

Alia bhatt sanjay leela bhansali: ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తీసిన చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు భన్సాలీ ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం చెప్పారు. 'గంగూబాయి..' కథ వినగానే ఆలియా భట్‌ కంగారుపడి తన ఆఫీసు నుంచి పారిపోయిందట. ఆ తర్వాత మళ్లీ కలిసి ఓకే చెప్పిందని తెలిపారు.

Alia Bhatt
ఆలియా భట్

"ఈ సినిమాలో ఆలియానే ఎంచుకోవాలని మొదటి నుంచి అనుకున్నాను. అందుకే, నా ఆఫీస్‌లో కూర్చొని ఆమెకు కథ చెప్పా. అందులో తన పాత్ర గురించి విని అలియా షాక్‌ అయింది. వెంటనే తన బ్యాగును పట్టుకొని ఆఫీస్‌ నుంచి పారిపోయింది. దీంతో నేను మరో హీరోయిన్‌ను వెతుక్కోవాల్సి వస్తుందేమోనని అనుకున్నా. కానీ, తర్వాత ఆలియానే ఫోన్‌ చేసి మరోసారి కలుద్దామని చెప్పింది. తర్వాత కథ నచ్చి ఒప్పుకొంది. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది" అని భన్సాలీ చెప్పుకొచ్చారు.

ముంబయి మాఫియా క్వీన్‌ గంగూబాయి జీవితచరిత్ర ఆధారంగా భన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే, గంగూబాయి జీవితాన్ని వక్రీకరించి సినిమా తీశారంటూ ఆమె కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాదే ఈ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆ కేసు పెండింగ్‌లో ఉంది. విడుదలపై స్టే ఇచ్చేందుకు ముంబయి హైకోర్టు నిరాకరించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.