ETV Bharat / sitara

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నటుడు అడవి శేష్‌

author img

By

Published : Sep 20, 2021, 3:23 PM IST

యువ హీరో అడవిశేష్​కు(Adavisesh movies) డెంగీ జ్వరం సోకింది. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

adavisesh
అడవిశేష్​

యువ హీరో అడవిశేష్(Adavisesh movies)​ అస్వస్థతకు గురయ్యారు. గత వారమే ఆయన డెంగీ జ్వరం బారిన పడటం, రక్తంలో ప్లేట్లెట్స్‌ పడిపోవడం​ వల్ల సెప్టెంబరు 18న ఆయన్ను ఆస్పత్రిలో చేర్చించారు. తాజాగా ఈ విషయాన్ని శేష్​ సోషల్​మీడియా టీమ్​ వెల్లడించింది.

ప్రస్తుతం శేష్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని.. పలువురు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆయన త్వరితగతిన కోలుకోవాలంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.

'గూఢచారి', 'ఎవరు' వంటి సస్పెన్స్‌ థ్రిల్లర్లతో ప్రేక్షకుల్ని అలరించిన శేష్‌ ప్రస్తుతం 'మేజర్‌'(adivi sesh major release date) చిత్రీకరణ పనుల్లో ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్‌ మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'మేజర్‌' రూపొందిస్తున్నారు. శశికిరణ్‌ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనితోపాటు 'హిట్‌-2'లోనూ(adivi sesh hit 2) శేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీని తర్వాత 'గూఢచారి2'లోనూ ఆయన నటించనున్నారు.

ఇదీ చూడండి: 'గూఢచారి 2' వచ్చేస్తోంది.. అడవి శేష్​ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.