ETV Bharat / sitara

వివాహ బంధంలోకి అడుగు పెట్టిన హీరోయిన్‌

author img

By

Published : Nov 18, 2021, 5:46 PM IST

నటి శ్రద్ధా ఆర్య వివాహబంధంలోకి అడుగుపెట్టారు. దిల్లీకి చెందిన నావికదళ అధికారి రాహుల్‌ శర్మను ఆమె పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లి ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు శ్రద్ధా.

shraddha
శ్రద్ధా ఆర్య

తెలుగులో, తమిళ భాషల్లో కథానాయికగా అలరించిన భామ శ్రద్ధా ఆర్య. కేవలం వెండితెరపైనే కాదు, టెలివిజన్‌ నటిగానూ తనదైన ముద్రవేసింది. హిందీలో రియాల్టీ షోలు, ధారావాహికలతో శ్రద్ధా ఆర్య మరింత గుర్తింపు తెచ్చుకుంది.

shraddha arya
శ్రద్ధా ఆర్య పెళ్లి

తాజాగా ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దిల్లీకి చెందిన నావికదళ అధికారి రాహుల్‌ శర్మను ఆమె వివాహం చేసుకున్నారు. చివరి నిమిషం వరకూ శ్రద్ధా వివాహం గురించిన వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. వివాహం అనంతరం అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో తెలిపారు. వివాహం సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో వధూవరులు మెరిసిపోయారు. శ్రద్ధా ఇండస్ట్రీ స్నేహితులైన అంజుమ్‌, నేహా అద్విక్‌, మహాజన్‌ తదితరులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. తెలుగులో 'గొడవ' ఆమె మొదటి సినిమా. వైభవ్‌ కథానాయకుడు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సాయిరామ్‌ శంకర్‌తో 'రోమియో'లో నటించారు.

shraddha arya
శ్రద్ధా ఆర్య పెళ్లి
shraddha arya
శ్రద్ధా ఆర్య పెళ్లి
shraddha arya
శ్రద్ధా ఆర్య పెళ్లి

ఇదీ చూడండి: మడోన్నా.. మనసు దోచేస్తున్నావ్ వద్దన్నా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.