ETV Bharat / sitara

అశ్లీల చిత్రాల కేసు.. నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు

author img

By

Published : Jul 26, 2021, 9:46 PM IST

రాజ్​కుంద్రా అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు పంపారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమె విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.

Sherlyn Chopra
షెర్లిన్ చోప్రా

మోడల్‌, నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు అందాయి. అశ్లీల చిత్రాలను తెరకెక్కించి, యాప్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో సంబంధాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రాను కూడా విచారించనున్నారు. ఈ మేరకు ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ప్రాపర్టీ సెల్‌ పోలీసులు ఆమెకు సమన్లు పంపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమె విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.

Sherlyn Chopra
షెర్లిన్ చోప్రా

మరోవైపు రాజ్‌కుంద్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ముంబయి పోలీసులు సీజ్‌ చేశారు. కాన్పూర్‌లోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా శాఖలో రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిలకు ఉన్న ఖాతాలను స్తంభింపచేయాలని ఎస్‌బీఐకి సూచించారు. తాము 20-25 నిమిషాల నిడివితో షార్ట్‌ ఫిలింస్ చేసినట్లు ఈ కేసుతో సంబంధం ఉన్న దర్శకుడు తన్వీర్‌ హష్మీ ఒప్పుకొన్నారు.

నేనెప్పుడూ రాజ్‌కుంద్రాను కలవలేదు: ఫ్లోరా సైనీ

రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల కేసు నేపథ్యంలో పలువురి పేర్లు బయటకు వస్తుండటం వల్ల ఎవరికి వారు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నటి ఫ్లోరా సైనీ స్పందించారు. తానెప్పుడూ రాజ్‌కుంద్రాను కలవలేదని చెప్పుకొచ్చారు. "ఈ విషయంలో నేను స్పందించకుండా ఉంటే నేనేదో దాస్తున్నట్లు అందరూ అనుకుంటారు. ఇద్దరు వ్యక్తులు వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేసుకుంటూ నా పేరు ప్రస్తావన తీసుకొచ్చినంత మాత్రాన నేను వాళ్లను కలిసి పనిచేసినట్లు కాదు. నటిగా నేను పలు సన్నివేశాల్లో నటించి ఉండవచ్చు. కానీ, ఆ తర్వాత అలాంటి సినిమాలకు దూరంగా ఉంటున్నా" అని చెప్పుకొచ్చారు.

ఇవీ చూడండి: సింగపూర్​ నుంచి రాజ్​కుంద్రా ఖాతాలకు భారీగా నగదు బదిలీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.