ETV Bharat / sitara

ఆ పని చేయలేక ఇంట్లోకి వెళ్లి దాక్కున్నా: నటుడు సుమన్​

author img

By

Published : Mar 13, 2022, 7:53 PM IST

suman
సుమన్​

Actor Suman: తెలుగు ఇండస్ట్రీకి వచ్చాక ఓ పని చేయలేక తాను ఇంట్లోకి వెళ్లి దాక్కున్నానని చెప్పారు సీనియర్​ నటుడు సుమన్​. ఆయన, భానుచందర్​ ప్రధానపాత్రల్లో నటించిన 'సేవాదాస్' చిత్ర ప్రచారంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు.

మీడియాతో మాట్లాడుతున్న సుమన్​

Actor Suman: తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో భాష రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డానన్నారు సీనియర్​ నటుడు సుమన్​. డైలాగ్స్​ చెప్పలేక ఇంట్లోకి వెళ్లి దాక్కున్నానని చెప్పారు. తనను భానుచందర్​ ఒత్తిడి చేసి తెలుగులోకి తీసుకువచ్చారని గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'సేవాదాస్​' చిత్రం ఏప్రిల్​ 1న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

'సేవాదాస్​'లో మరో సీనియర్​ నటుడు భానుచందర్​ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రంలో బంజార సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించారని చెప్పారు భానుచందర్.​ బంజార దేవుడు సేవాలాల్​ పాత్రలో సుమన్​ అద్భుతంగా నటించారని ప్రశంసించారు.

శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బంజారా, తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో రూపొందుతోంది.

ఇదీ చదవండి: నెటిజన్​పై సమంత ఫైర్.. దుస్తులపై అలాంటి కామెంట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.