ETV Bharat / sitara

'ఈ సినిమాలో నేను నటిస్తా.. కానీ ఓ కండిషన్'

author img

By

Published : Jan 22, 2022, 6:35 PM IST

సుధీర్ బాబు, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా మోహన్​కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. తాజాగా ఈ సినిమా టీజర్​ను రిలీజ్ చేసింది చిత్రబృందం.

Aa Ammayi Gurinchi Meeku Cheppali teaser, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్
Aa Ammayi Gurinchi Meeku Cheppali

"ఇన్ని రోజులు నన్ను నేను అమ్ముకుని సినిమాలు తీశాను. మొదటిసారి నన్ను నేను నమ్ముకుని సినిమా తీద్దామనుకుంటున్నా" అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన కథానాయకుడిగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. కృతిశెట్టి కథానాయిక. శనివారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ చిత్రంలో సుధీర్‌బాబు సినిమా దర్శకుడిగా కనిపించనున్నారు. ఒక అబ్బాయి జీవితాన్ని ఓ అమ్మాయి ఎలా ప్రభావితం చేసింది? అనూహ్యంగా వీళ్లు ఎలా ప్రేమలో పడ్డారు? ప్రేమతోపాటు వాళ్లు అనుకున్నది ఎలా సాధించారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: సమంత ఐటెం సాంగ్‌కు బీటీఎస్‌ స్టెప్పులు.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.