ETV Bharat / sitara

ఆరు నిమిషాల్లోనే సూపర్ హిట్ పాట రాసిన స్టార్ హీరో!

author img

By

Published : Oct 20, 2021, 5:10 PM IST

dhanush
ధనుష్​

తమిళ స్టార్​ హీరో ధనుష్(actor dhanush real name)​ గొప్ప నటుడే కాదు దర్శకుడు, గేయ రచయిత, కథా రచయిత, నిర్మాత, గాయకుడు అని చాలా మందికి తెలుసు(Dhansuh latest updates). సాధారణంగా ఓ పాట రాసి దాన్ని రికార్డింగ్​ చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ ధనుష్​ కేవలం ఆరు నిమిషాల్లోనే ఓ గీతాన్ని రాశారని మీకు తెలుసా? ఆ సాంగ్​ ఏంటి? ఇంకా ఆయన కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులు మీ కోసం..

చూడగానే ఆకట్టుకునే రంగు ఆయనకు లేదు(Dhanush latest news). ఆకర్షించే కటౌట్‌ ఆయనది కాదు. అసలు నటనంటే ఏంటో తెలీదు. మరి ఎవరైనా అలాంటి వ్యక్తిలో నటుడ్ని గుర్తిస్తారా? ఆయన స్టార్‌ హీరో అవుతారని ఊహిస్తారా? కానీ ఇప్పుడు ఆయన నేటి తమిళ స్టార్‌ హీరోల్లో ఒకరు. ఆయనే ధనుష్(dhanush updates)​.. ఆయన గురించి కొన్ని విశేషాలు మీ కోసం.

అసలు పేరు

1983 జులై 28న మద్రాసులో జన్మించారు ధనుష్‌. అసలు పేరు వెంకటేశ్‌ ప్రభు కస్తూరి రాజా(actor dhanush real name). 16ఏళ్ల వయసులో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన.. ప్రముఖ నటులు ప్రభుదేవా, ఇలయ తిలగమ్​ ప్రభుతో స్క్రీన్​ షేర్​ చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన పేరు మార్చుకోవాల్సి వచ్చింది! ధనుష్‌కు ఇద్దరు సోదరీమణులు, ఒక అన్నయ్య ఉన్నారు. '7జీ బృందావన కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవన్ ధనుష్‌ సోదరుడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇష్టం లేకుండానే

సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడం వల్ల ఆయన కూడా నటననే వృత్తిగా ఎంచుకోవాల్సి వచ్చింది. ఇష్టం లేకుండానే చిత్రసీమలో అడుగుపెట్టినట్లు ఓ సందర్భంలో తెలిపారు. హోటల్​ మేనేజ్​మెంట్​లో డిగ్రీ పట్టా అందుకొని చెఫ్​ అవ్వాలనుకున్నారు. కానీ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన తన తొలి సినిమా 'తుల్లువదో ఇలమై'(2002) తన తండ్రి కస్కూరి రాజా దర్శకత్వంలో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పరమేశ్వరుని భక్తుడు

సూపర్​స్టార్​ రజనీకాంత్​ పెద్ద కూతురు ఐశ్వర్యా రాజేష్​ను వివాహమాడారు ధనుష్(rajinikanth dhanush relationship)​. రజనీ తరహాలోనే ఆయన కూడా ఆధ్యాత్మిక భావన కలిగిన వారు! పరమేశ్వరుని భక్తుడు. అందుకే ఆయన ఇద్దరు కుమారులకు యాత్ర, లింగ అనే పేర్లను పెట్టారు.

ఆరు నిమిషాల్లోనే

ధనుష్​ గొప్ప నటుడే కాదు దర్శకుడు, గేయ రచయిత, కథా రచయిత, నిర్మాత, గాయకుడు. ఆయన శ్రుతిహాసన్​తో కలిసి నటించిన '3' సినిమాలోని 'వై దిస్​ కొలవరి డి' సాంగ్​(dhanush why this kolaveri di lyrics) అప్పట్లో ప్రపంచాన్ని ఎంతగా ఊపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటను ఆయన ఆరు నిమిషాల్లోనే రాసి 35 నిమిషాల్లో రికార్డింగ్​​ చేయడం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రేమ పెళ్లి

తన రెండో సినిమా విడుదల సమయంలో ఐశ్వర్య (రజనీకాంత్‌ కుమార్తె).. ధనుష్‌ను ఇంటర్య్వూ చేశారు(aishwarya rajinikanth wedding). తర్వాత మెల్లమెల్లగా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. అప్పటి నుంచి ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌(rajnikanth dhanush movie) అల్లుడిగా మారారు ధనుష్‌.

కోలీవుడ్‌ టు హాలీవుడ్‌ వయా బాలీవుడ్

నటుడిగా(dhanush hollywood film) ఒక్కో మెట్టు ఎక్కుతూ కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌, హాలీవుడ్‌, టాలీవుడ్‌లోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారు ధనుష్. 'రాంఝానా' చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి 'షమితాబ్‌'తో ప్రశంసలు అందుకున్నారు. 'ది ఎక్స్టార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌' ఆయన నటించిన తొలి ఆంగ్ల చిత్రం(dhanush hollywood upcoming films). 'రఘువరన్‌ బీటెక్‌' చిత్రంతో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు.

నేరుగా తెలుగులోనూ..

త్వరలోనే నేరుగా తెలుగు దర్శకుడు శేఖర్‌ కమ్ములతో సినిమా చేయనున్నారు ధనుష్. ప్రస్తుతం 'అత్రాంగి రే', 'ది గ్రే మ్యాన్‌', 'మారన్​', 'నానే వరువేన్​' చిత్రాల్లో నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ ,చూడండి: 'వీడు హీరోనా అన్నారు.. బోరున ఏడ్చేశా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.