ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో నయా ఫీచర్​.. 'లాక్ చాట్​'తో మీ పర్సనల్​ చాటింగ్​ సేఫ్​!

author img

By

Published : Apr 2, 2023, 11:43 AM IST

Updated : Apr 2, 2023, 12:11 PM IST

whatsapp new features lock chat and text editor
వాట్సాప్ కొత్త ఫీచర్స్ లాక్ చాట్ టెక్స్ట్​ ఎడిటర్

మీ వాట్సాప్​ చాట్​ను ఎవరైనా చూస్తారమోనని భయంగా ఉందా?.. అయితే ఇప్పుడు మీకు ఓ గుడ్​న్యూస్​. వాట్సాప్​ ఓ కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తేనుంది. దాని ద్వారా మీ ఫింగర్​ ప్రింట్​ లేకుండా ఎవరూ మీ పర్సనల్​ చాట్​ ఓపెన్ చేయలేరు!. ఆ సంగతేంటో చూద్దాం రండి.

ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​లో ఓ నయా ఫీచర్​ అందుబాటులోకి రానుంది. దీంతో ఎవరైనా మన ఫోన్​ను తీసుకుని పర్సనల్​ చాటింగ్​ను చూడాలని ప్రయత్నించినా ఆ ఫీచర్​ చూడకుండా నియంత్రిస్తుంది. అంతేగాక యాప్​లోని ప్రతి కాంటాక్ట్​ చాట్​కు లాక్​ వేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది.

Wabetainfo నివేదిక ప్రకారం.. లాక్‌ చాట్‌ అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ అభివృద్ధి చేస్తోంది. దీనితో యూజర్లు తమ ప్రైవేట్‌ చాట్లకు లాక్‌ విధించుకునే ఆప్షన్‌ ఉంటుంది. అంటే తమ వ్యక్తిగత చాట్లపై యూజర్లకు పూర్తి నియంత్రణ ఉండనుంది. తద్వారా గోప్యతతో పాటు, భద్రత మరింత పెరగనుంది. ఒకసారి చాట్‌ను లాక్‌ చేస్తే.. కేవలం యూజర్‌ మాత్రమే ఫింగర్‌ ప్రింట్‌ లేదా పాస్‌కోడ్‌ ద్వారా దాన్ని చూడగలుగుతారు.
ఇతరులెవరూ లాక్‌ చేసిన చాట్‌ను తెరవడం కుదరదు.

ఒకవేళ ఎవరైనా ఫోన్‌ తీసుకొని లాక్‌ చేసిన చాట్‌ను పాస్‌కోడ్‌ లేదా ఫింగర్‌ ప్రింట్‌ లేకుండా చూడాలని ప్రయత్నిస్తే.. ఆ చాట్‌ మొత్తాన్ని చెరిపేయాలని కోరుతుంది. అలాగే లాక్‌ చేసిన చాట్‌లో వచ్చిన ఫొటోలు, వీడియోలు నేరుగా డివైజ్‌ గ్యాలరీలో సేవ్‌ కావు. ఈ ఫీచర్​ విజయవంతమైతే.. యూజర్​ మాత్రమే ఫింగర్​ప్రింట్​ లేదా పాస్‌వర్డ్​ ద్వారా చాట్​ ఓపెన్​ చేయగలడు. మిగతా ఎవరైనా చాట్‌ను తెరిచి చూడటం దాదాపు అసాధ్యం.

ఈ లాక్​ చాట్​ ఫీచర్​ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని Wabetainfo తెలిపింది. దీన్ని అధికారికంగా ఎప్పుడు ప్రవేశపెడతారనేది త్వరలోనే చెబుతామంది. ఈ ఫీచర్​ గనుక అందుబాటులోకి వస్తే వాట్సాప్​ యూజర్​ గోప్యతకు భద్రత ఉంటుందని వెల్లడించింది. ఇటీవల కాలంలో వాట్సాప్​ గోప్యతతో పాటు భద్రత విషయంలో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూజర్ల అపోహలు తొలగించే ప్రక్రియలో భాగంగానే ఈ కొత్త ఫీచర్ల వాట్సాప్​ తేనుందని సమాచారం. కేవలం యూజర్ల ప్రైవసీని మరింత పెంచేలా వాట్సాప్​ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్​ టైపింగ్​ను మరింత మెరుగ్గా..
'లాక్ చాట్' ఫీచర్‌తో పాటు ఆండ్రాయిడ్ బీటా వెర్షన్​లో కొంతమంది యూజర్ల కోసం వాట్సాప్​ కొత్త టెక్స్ట్​ ఎడిటర్ ఎక్స్పీరియన్స్​ను కూడా పరీక్షిస్తోంది. యూజర్ల టైపింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ పెంచేలా అదనపు ఫార్మాటింగ్ ఆప్షన్లతో కూడిన ఈ ఫీచర్‌పైన వాట్సాప్‌ వర్క్‌ చేస్తోంది.

Last Updated :Apr 2, 2023, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.