ETV Bharat / science-and-technology

WhatsApp Latest Update : వాట్సాప్ యూజర్స్​కు గుడ్​ న్యూస్​.. త్వరలోనే​ న్యూ ఇంటర్​ఫేస్​ షురూ!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 1:27 PM IST

WhatsApp is working on a new interface
WhatsApp Latest Update

WhatsApp Latest Update In Telugu : ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్ త్వరలో సరికొత్త ఇంటర్​ఫేస్​తో దర్శనం ఇవ్వనుంది. ముఖ్యంగా వాట్సాప్ యూజర్లకు మరింత సౌలభ్యంగా ఉండేందుకు.. చాట్​ పేజ్​లో టాప్​ బార్​ను తీసుకురానుంది. పూర్తి వివరాలు మీ కోసం..

WhatsApp Latest Update : మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్లతో తన యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్ ఇంటర్​ఫేస్​ను న్యూలుక్​తో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. అలాగే చాట్​ పేజ్​లో టాప్​ బార్​ను కూడా తీసుకురానుంది.

వాట్సాప్​ న్యూ లుక్​ అదుర్స్​
WhatsApp New Interface : వాట్సాప్​ ఇప్పటికే చాట్‌ లాక్ ఫీచర్​​ తీసుకువచ్చింది. వీడియో కాల్ సమయంలో స్క్రీన్‌ షేరింగ్‌, హెచ్‌డీ ఫొటో షేరింగ్‌ లాంటి సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందించింది. ఇప్పుడు కొత్త రూపులో వాట్సాప్‌ యూజర్ల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా చాట్‌ పేజ్‌ పై భాగంలో తెల్లని రంగులో బార్‌ను తీసుకురానుంది. దీని కోసం యూజర్‌ ఇంటర్ ఫేస్‌లో చాలా మార్పులు చేస్తోంది. దీని వల్ల మనకు కావాల్సిన వ్యక్తుల చాట్‌లను త్వరగా వెతకటానికి వీలవుతుందని వాట్సాప్ చెబుతోంది.

సమ్​థింగ్​ న్యూ
WhatsApp Top Bar Change : సాధారణంగా వాట్సాప్‌ చాట్ బార్‌లో మన కాంటాక్ట్స్‌ అన్నీ ఉంటాయి. అందులో మన కుటుంబ సభ్యుల, స్నేహితుల, ఆఫీస్ కాంటాక్ట్ నంబర్స్​​ అన్నీ కలిసి ఉంటాయి. అందుకే మనకు కావల్సిన వ్యక్తితో చాట్‌ చేయాలంటే.. ఈ పెద్ద కాంటాక్ట్​ లిస్ట్‌ మొత్తం వెతుక్కోవాలి. లేదా సెర్చ్‌ బార్‌లో టైప్​ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ అవసరం లేకుండా సులువుగా చాట్‌లను తెలుసుకొనే విధంగా వాట్సాప్‌ పర్సనల్‌ ఇంటర్‌ ఫేస్‌లో మార్పులు తీసుకువస్తోంది. దీనితో త్వరలోనే వాట్సాప్‌ సరికొత్త రూపంలోకి మారనుంది. వాట్సాప్‌ను తెరవగానే పై భాగంలో బార్‌ కనిపిస్తుంది. అందులో ఆల్‌, అన్‌రీడ్‌, పర్సనల్‌, బిజినెస్‌ ట్యాబ్‌లు కనిపిస్తాయి. దీనితో సులభంగా మీ చాట్‌లను వెతుక్కోవడానికి వీలవుతుంది.

  • 📝 WhatsApp beta for Android 2.23.18.18: what's new?

    WhatsApp is working on a new interface for the white top app bar with a green app name, and it will be available in a future update of the app!

    What are your thoughts about it? Share them below!https://t.co/KQA4c8u6pn pic.twitter.com/b18XcttHfD

    — WABetaInfo (@WABetaInfo) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గ్రీన్ కలర్​ ఉండదు!
WhatsApp Green Color Change : ఇకపై వాట్సాప్‌ పై భాగంలో గ్రీన్‌ కలర్‌ ఉండదు. కానీ గ్రీన్​ కలర్​లో వాట్సాప్ అనే టెక్ట్స్‌ ఉంటుంది. అలాగే కెమెరా, సెర్చ్‌ ఆప్షన్లు కూడా పై భాగంలోనే ఉంటాయి. కింది భాగంలో చాట్‌, స్టేటస్‌, కాంటాక్ట్స్‌, కాల్​ ఆప్షన్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం వాట్సాప్‌ న్యూ ఇంటర్​ఫేస్ అనేది.. ఆండ్రాయిడ్​ వాట్సాప్​ బీటా వెర్షన్​లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే ఇది అందరు యూజర్లకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.