ETV Bharat / science-and-technology

వాట్సాప్ స్టిక్కర్లతో చాటింగ్ మరింత క్రేజీగా...

author img

By

Published : Jul 9, 2020, 6:21 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందించడంలో వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగా చాటింగ్​లో బోర్​ కొట్టకుండా.. ఆసక్తికరంగా మెసేజ్​లు పంపించుకునేందుక్ స్టిక్కర్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్.

new features in Whatsapp
వాట్సాప్​లో కొత్త ఫీచర్లు

ప్రస్తుతం వాట్సాప్ వినియోగం సర్వసాధారణమైపోయింది. ఇందులో టెక్స్​ట్​ సందేశాలతో పాటు .. భావాలను వ్యక్తపరిచేందుకు ఎమోజీలను వినియోగిస్తుంటాం. ఇప్పుడు ఈ భావాలను మరింత ప్రభావవంతంగా వ్యక్తం చేసేందుకు యానిమేటెడ్​ స్టిక్కర్స్ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. ఇప్పటి వరకు థర్డ్​పార్టీ యాప్​ ద్వారా ఈ తరహా స్టిక్కర్లను వినియోగించేవారు కొందరు యూజర్లు.

స్టిక్కర్లతో మరింతగా ఈజీ..

యానిమేటెడ్​ స్టిక్కర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్​... ఈ గ్రాఫిక్స్​తో భావాలను మరింత లోతుగా వ్యక్తపరచవచ్చని అభిప్రాయపడింది. యూజర్లను కచ్చితంగా ఈ ఫీచర్​ ఆకట్టుకుంటుందని ఆశిస్తోంది.

స్టిక్కర్​లు వినియోగించడం ఎలా?

వాట్సాప్ స్టిక్కర్లను వినియోగించేందుకు చాట్ ఓపెన్​ చేసి... అందులో ఎమోజీ బటన్​ను నొక్కాలి.

ఇప్పటి వరకు అక్కడ ఎమోజీ, జిఫ్​ ట్యాబ్​లు కనిపించేవి. ఇకపై వాటి పక్కన స్టిక్కర్​ ట్యాబ్​ కనిపిస్తుంది. దానిని నొక్కాలి.

ఆ పక్కనే '+' సింబల్ కనిపిస్తుంది. దానిని నొక్కితే రకరకాల స్టిక్కర్​ ప్యాక్​లు వస్తాయి. అందులో మీకు నచ్చిన వాటిని డౌన్​లోడ్ చేసుకుని చాటింగ్​లో ఉపయోగించుకోవచ్చు. మీకు వద్దనుకుంటే వాటిని డిలీట్ చేసే సదుపాయం కూడా ఉంది.

ఇదీ చూడండి:జియో ఎఫెక్ట్​: భారత్​ కోసం 'జూమ్' ప్రత్యేక ప్లాన్

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.