ETV Bharat / science-and-technology

హై క్వాలీటీ వీడియో షేరింగ్​.. వాట్సాప్​ లేటెస్ట్​ ఫీచర్​!

author img

By

Published : Jul 1, 2023, 3:50 PM IST

Whatsapp High Quality Video Send
Whatsapp High Quality Video Send

Whatsapp High Quality Video Send : ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​.. మరో కొత్త ఫీచర్​ను తీసుకురానుంది. హై క్వాలిటీ వీడియోలను షేర్​ చేయాలనుకునే వారికి ఈ ఫీచర్​ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఫీచర్​ గురించి ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Whatsapp Features 2023 : ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్​.. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకువస్తోంది. తాజాగా అలాంటి మరో ఫీచర్​ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్​తో వాట్సాప్​లో హై క్వాలిటీ వీడియోలను షేర్​ చేసుకోవచ్చు. ఆ ఫీచర్​ గురించి పూర్తి సమాచారం ఈ కథనం ద్వారా తెలుసుకోండి.

త్వరలో వాట్సాప్​లో హై క్వాలిటీ వీడియోలు షేర్​ చేసుకోవచ్చని సమాచారం. ఈ మేరకు WaBetaInfo తమ నివేదికలో పేర్కొంది. ఈ ఫీచర్​ ఇప్పటికే కొంత మంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని సమాచారం. ఈ ఫీచర్​లో భాగంగా హై క్వాలిటీ వీడియోలను షేర్​ చేసుకోవడానికి.. వాట్సాప్​ డ్రాయింగ్​ ఎడిటర్​లో ఒక బటన్​ ఇవ్వనున్నారు. వీడియోలను షేర్​ చేయాలనుకున్నప్పుడు ఆ బటన్​ను ఎనేబుల్​ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Whatsapp High Quality Video Send : హై క్వాలిటీ ఫొటో ఫీచర్ లాగానే.. వీడియోను షేర్​ చేసేటప్పుడు 'మీడియా క్వాలిటీ' అనే పాప్​అప్​ ఓపెన్​ అవుతుంది. అందులో 'స్టాండర్​ క్వాలిటీ', 'హెచ్​డీ క్వాలిటీ' అనే డీఫాల్ట్​ ఆప్షన్స్​ ఉంటాయి. సాధారణంగా స్టాండర్డ్ క్వాలిటీ.. వాడితే తక్కువ స్టోరేజ్​ స్పేస్​ తీసుకుని.. తొందరగా సెండ్​ అవుతుంది. యూజర్ ఇంకా​ ఎక్కువ నాణ్యత కలిగిన వీడియోలను షేర్​ చేయాలనుకున్నప్పుడు.. 'హెచ్​డీ క్వాలిటీ' ఆప్షన్​ను సెలెక్ట్​ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఫీచర్​ ఉపయోగించి వీడియోలను పంపినప్పుడు.. చాట్​ విండోలో దానికి అటోమేటిక్​గా హైక్వాలిటీ వీడియో​ ట్యాగ్​ వస్తుంది. అయితే, వీడియోలను ఒరిజినల్​ క్వాలిటీలో పంపించలేము. ఎందుకంటే.. వీడియో కచ్చితంగా ఎంతో కొంత కంప్రెస్ అవుతుంది. అయినా.. వీడియో నాణ్యత బాగానే ఉంటుంది. ఈ ఫీచర్​ గురించి తెలుసుకోవాలంటే ఎక్కువ సైజ్​ ఉన్న వీడియోను సెలెక్ట్​ చేసుకోవాలి. తక్కువ సైజ్ వీడియో ఉంటే ఈ ఆప్షన్​ ఎనేబుల్​ కాదని సమాచారం. ఆండ్రాయిడ్​ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్​.. త్వరలో యాపిల్​ బీటా యూజర్లకు కూడా అందుబాటులోకి రానుందని సమాచారం.

అప్​కమింగ్​ వాట్సాప్​ ఫీచర్స్​..
Upcoming WhatsApp Features : త్వరలో వాట్సాప్​​లో మరిన్ని కొత్త ఫీచర్స్​ తెచ్చేందుకు వాట్సాప్​ మాతృ సంస్థ మెటా సన్నాహాలు చేస్తోంది. మెసేజ్​ డిస్​అపీయరింగ్ మోడ్, వ్యూ ఒన్స్​ అండ్​ మల్టీ డివైజ్, మెసేజ్​ పిన్, పిన్​ డ్యురేషన్ లాంటి ఫీచర్లను త్వరలో బీటా యూజర్లకు అందించనుంది. అలాగే వాట్సాప్​ పైభాగంలో డార్క్​ కలర్​ బార్​ కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫీచర్ల గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.