ETV Bharat / science-and-technology

ఐరోపా దేశాల్లో రోడ్లెక్కనున్న ఎగిరే కార్లు!

author img

By

Published : Oct 28, 2020, 7:32 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

గాలిలో ఎగిరే కార్లు ఐరోపా దేశాల్లో త్వరలోనే రోడ్లెక్కనున్నాయి. డచ్​ సంస్థ పాల్​-వి రూపొందించిన ప్లయింగ్ కార్లకు అధికారిక అనుమతి లభించింది. మూడు చక్రాలతో చిన్నసైజు హెలికాప్టర్​ను పోలి ఉండే ఈ వాహనాలు గంటకు 160కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. స్విచ్ విధానంతో 10 నిమిషాల్లో రోడ్డుపై నుంచి గాల్లోకి ఎగిరేలా వీటిని రూపొందించారు.

Dutch flying car granted road legal status in Europe
ఐరోపా దేశాల్లో రోడ్లెక్కనున్న ఎగిరే కార్లు!

ఐరోపా దేశాల్లో రోడ్లెక్కనున్న ఎగిరే కార్లు

డచ్ సంస్థ పాల్-వి రూపొందించిన 'లిబర్టీ' ఫ్లయింగ్ కార్లకు ఐరోపా సమాఖ్య అధికారిక ఆమోదం లభించింది. త్వరలోనే ఈ ఎగిరే కార్లు రోడ్లెక్కనున్నాయి. మూడు చక్రాలతో చిన్నసైజు హెలికాప్టర్లను పోలిఉండే ఈ కార్లు రోడ్డుపై గంటకు 160కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. గాలిలో అయితే గంటకు 180కి.మీ వేగంలో ఎగిరే సామర్థంతో వీటిని రూపొందించారు. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే దాదాపు 500 కి.మీ దూరం వరకు విహరించగలవు. ఈ ప్లయింగ్​ కారును 10 నిమిషాల్లోనే రోడ్డుపై నుంచి గాల్లోకి ఎగిరేలా స్విచ్ విధానంతో రూపొందించారు.

రోడ్లపై నడిపేందుకు అనుమతి పొందడానికి చాలాకాలం పాటు ఎదురు చూసినట్లు పాల్​-వి సంస్థ వ్యవస్థాపక సీఈవో రాబర్ట్ డింగెమాన్సేే తెలిపారు. మొదటగా తయారు చేసే 90 ఫ్లయింగ్ కార్ల ధరను 500,000 యూరోలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత తయారు చేసే ఒక్కో కారు ధర 400,000 యూరోల నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నెదర్లాండ్స్​లో ఇప్పటికే 30 కార్లకు బుకింగ్​ పూర్తయినట్లు చెప్పారు.

ఈ ఫ్లయింగ్ కార్ల టెస్టు డ్రైవ్​ను 2012నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాబర్ట్. ఎట్టకేలకు రోడ్లపై తిరిగేందుకు అనుమతి లభించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఐరోపా పౌరవిమానయాన భద్రతా సంస్థ ధ్రువపత్రం కోసం 2015నుంచి ప్రయత్నిస్తున్నామని.. అది కూడా పూర్తయ్యాక 2022 నుంచి ప్లయింగ్​ కార్లను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.