ETV Bharat / science-and-technology

సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎం32

author img

By

Published : May 25, 2021, 5:26 PM IST

galaxy m32
గెలాక్సీ ఎం32

శాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంఛ్ చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చినందున.. భారత్​లో లాంఛింగ్​కు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని నిపుణులు అంచనా వేశారు.

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎం32ను త్వరలోనే భారత్​లో విడుదల చేయనుంది. ఈ మేరకు శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ప్రత్యేక పేజీ ఒకటి ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నట్లు టెక్​ నిపుణులు వెల్లడించారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం32 ఫీచర్స్..

  • హీలియో జీ80 చిప్‌సెట్
  • 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
  • 6 జీబీ ర్యామ్
  • ఆండ్రాయిడ్ 11 ఓఎస్
  • 20 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా
  • 64ఎంపీ రేర్ కెమెరా
  • 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్​ప్లే
  • 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్

ఆన్​ డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్​తో వచ్చే ఈ ఫోన్​.. బ్లాక్, వైట్, లేత నీలం రంగుల్లో లభించే అవకాశం ఉంది.

ఇప్పటికే ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చినందున.. భారత్​లో విడుదల​కు సంబంధించి జూన్ ప్రారంభంలో శాంసంగ్​ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చదవండి: క్యూ1లో శాంసంగ్​కు భారీ లాభాలు

శాంసంగ్​ నుంచి మూడు కొత్త ల్యాప్​టాప్​లు.. ప్రత్యేకతలివే

వన్​ప్లస్​ నుంచి మరో ఖరీదైన ఫోన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.