ETV Bharat / science-and-technology

సింగిల్ ట్యాప్​తో పని పూర్తి.. బ్రౌజింగ్​లో గోప్యత.. ఈ 12 ఆండ్రాయిడ్ యాప్స్ గురించి తెలుసా?

author img

By

Published : Apr 22, 2023, 11:31 AM IST

ప్రస్తుత కాలంలో స్మార్ట్​ఫోన్ తప్పనిసరి అయిపోయింది. చేతిలో మొబైల్​ లేనిదే బయటకు వెళ్లట్లేదు. ఫోన్​పే, గూగుల్​పే, గూగుల్ లోకేషన్స్ వంటి వాటిని కోసమైనా ఫోన్​ను తీసుకెళ్లాల్సిందే. కొందరు యాపిల్ ఫోన్లు వాడితే.. అధిక శాతం మంది ఆండ్రాయిడ్ మొబైల్స్​ను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో 12 ఉపయోకరమైన యాప్స్​ గురించి ఓ సారి తెలుసుకుందాం.

12 Amazing Applications For Android And Apple Mobiles
ఆండ్రాయిడ్ ఆపిల్ మొబైల్స్ కోసం 12 అమేజింగ్​ యాప్స్

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తారు. యాపిల్ ఫోన్లతో పోలిస్తే.. తక్కువ ధర, యూజర్ ఫ్రెండ్లీ.. ఇలా అంశాలేవైనా అండ్రాయిడ్ ఫోన్లను వినియోగించడానికి చాలామంది ఇష్టపడపుతున్నారు. మన ఫోన్​లో ఎన్నో యాప్స్ ఇన్​స్టాల్​ చేసుకొని వాడుతుంటాం. అయితే చాలా మందికి తెలియని.. మోస్ట్ యూజ్ ఫుల్ 12 యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యాక్షన్ బ్లాక్స్​ (గూగుల్) : ఇప్పటిదాకా మీరు వినని గూగుల్ యాప్స్​లో ఇదొకటి! గూగుల్ అసిస్టెంట్ సాయంతో మన రోజువారీ పనులు, టాస్క్​లను సులభతరం చేస్తుంది. అసిస్టెంట్ వాయిస్ కమాండ్​తో​ ఇది పనిచేస్తుంది. సింగిల్ ట్యాప్​తో మన పనులన్నీ అయిపోయేలా చేస్తుంది. ఇందుకోసం ముందుగా.. మొబైల్ హోమ్ స్క్రీన్​పై ఒక యాక్షన్ బ్లాక్ క్రియేట్ చేసి మనం చేయాలనుకున్న పనిని అందులో యాడ్ చేయాలి. ఇవి మనకు షార్ట్ కట్స్ లాగా ఉపయోగపడతాయి. దాన్ని ట్యాప్ చేసి మన పనిని చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక్క ట్యాప్​తో మ్యూజిక్ ప్లే చేయడం, ఫోన్ చేయడం, మెసేజ్ పంపిచండం వంటివి చేయవచ్చు.

రిమోట్ డెస్క్​టాప్ : మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేసిన ఈ యాప్​తో మన డెస్క్​టాప్, వర్క్ సర్వర్లతో మన ఫోన్​లోని డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఒక డివైజ్ నుంచి మరొకదానికి టెక్ట్స్​ను షేర్ చేసుకోవడానికి స్క్రీన్ కాప్చర్, క్లిప్ బోర్డు యాక్సెస్​ ఆప్షన్​ కూడా ఉంటుంది. ఈ యాప్ మీ పనిని సులభతరం చేయడమే కాకుండా డివైజ్​లను మార్చేటప్పుడు శ్రమను తగ్గిస్తుంది.

వికిమీడియా కామన్స్ : మనందరికీ వికిపీడియా తెలుసు కానీ ఈ వికిమీడియా ఏంటి అని అనుకుంటున్నారా..? ఇదొక ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ ఆధారిత ప్రాజెక్టు. ఇందులో చిత్రాలు ఉచితంగా అప్ లోడ్, డౌన్​లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వివిధ రకాల కేటగిరీల్లో వందల కొద్ది మల్టీమీడియా చిత్రాలుంటాయి. వీటిని మీ బ్లాగులు, ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

ట్రాకర్ డిటెక్ట్ : యాపిల్ కంపెనీ తయారు చేసిన ఈ యాప్.. మన వ్యక్తిగత భద్రతకు సంబంధించింది. ఇది మీరు ట్రాకర్లను కనుగొనటానికి సహాయపడుతుంది. ఉదాహరణకు ఎవరైనా ఇరత వ్యక్తులు ఎయిర్ ట్యాగ్, ఇతర డివైజ్​ను ఉపయోగించి మీ లొకేషన్​ను తెలుసుకోవాలనుకుంటే.. దీని ద్వారా స్కాన్ చేసి ఈజీగా కనుక్కోవచ్చు.

ఓపెన్ డోర్స్ : ఇది ట్రూ కాలర్ అప్లికేషన్​​ నుంచి వచ్చిన యాప్. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, సంప్రదాయాల మనుషుల్ని కలుసుకోవడానికి.. వారితో పరిచయాలు పెంచుకుని మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులుండవు.

లెర్న్ టూ రీడ్ : అమెరికాకు చెందిన డుయోలింగో అనే ఎడ్యుకేష‌న‌ల్ టెక్నాల‌జీ కంపెనీ పిల్ల‌ల కోసం ఈ యాప్ రూపొందించింది. ఈ యాప్ ద్వారా చిన్న‌త‌నం నుంచే పిల్లలు ఆంగ్లంలో చ‌ద‌వ‌డం, రాయటం నేర్చుకోవ‌చ్చు. ఇందులో పిల్ల‌ల చ‌దువు సామ‌ర్థ్యం, నైపుణ్యం పెంచుకోవ‌డానికి సంబంధించిన కంటెంట్, పాఠాలుంటాయి. పిల్ల‌ల‌ను ఆక‌ర్షించ‌డానికి ర‌క‌ర‌కాల యానిమేషన్లు, కార్టూన్లు కూడా ఉంటాయి.

సౌండ్ ట్రాప్ స్టూడియో : సౌండ్ ట్రాప్ స్టూడియో.. మ్యూజిక్ రికార్డింగ్ యాప్​. పియానో, డ్ర‌మ్స్ ఇంకా కొన్ని సంగీత వాయిద్యాల ఎఫెక్ట్​లను అందిస్తుంది. మీరు కంపోజ్​ చేసే మ్యూజిక్​ను ఇందులో రికార్డ్ చేయవచ్చు.

డ్రాప్ బాక్స్ పేప‌ర్ : ఆఫీసులోని అవసరాల కోసం ఉపయోగడే యాప్ డ్రాప్ బాక్స్ పేపర్​. ఇందులో టీమ్ స‌భ్యులంతా క‌లిసి త‌మ ఆలోచ‌న‌ల‌ను షేర్ చేసుకోవ‌చ్చు. వాటిని మీరు స‌మీక్షించి కామెంట్ పెట్టొచ్చు.

ఫ్యూలియో : ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డే యాప్​ల‌లో ఇదొక‌టి. ఇది ఇంధ‌న వినియోగం, వాటిపై ఎంత ఖ‌ర్చు చేస్తున్నాం అనే అంశాల‌ను ట్రాక్ చేస్తుంది. ఇంధ‌న వినియోగాన్ని లెక్కించ‌డం, వాహన మైలేజీని దీని ద్వ‌ారా తెలుసుకోవ‌చ్చు.

పాకెట్ కాస్ట్స్ : ఇది మంచి ఫీచ‌ర్ల‌తో కూడిన పాడ్​కాస్ట్​ యాప్‌. వ‌ర్డ్​ప్రెస్​ లాంటి యాప్​ల‌ను త‌యారు చేసిన ఆటోమెటిక్ అనే సంస్థ‌ ఈ యాప్​ను తయారు చేసింది. ఇందులో వివిధ కేట‌గిరీల‌కు చెందిన వంద‌ల కొద్దీ పాడ్​కాస్ట్​లను విన‌వ‌చ్చు. మ్యూజిక్ యాప్​లో ఉండే అన్ని ఫీచ‌ర్లు ఇందులో ఉండ‌టం విశేషం.

అవాస్ట్ సెక్యూర్ బ్రౌజ‌ర్ : ఇదొక ఆండ్రాయిడ్ వెబ్ బ్రౌజ‌ర్‌. ఫోన్‌ని సురక్షితం చేసుకోవడానికి యాంటీవైరస్‌ ఎలా వాడతామో.. బ్రౌజింగ్‌లో గోప్యతని పాంటించేందుకు ప్రైవేటు బ్రౌజర్‌ని వాడుతాం. అందుకే ఈ సెక్యూర్డ్‌ బ్రౌజర్‌. పబ్లిక్‌ వై-ఫైని వాడుకునే క్రమంలో వర్చువల్‌ ప్రైవేటు నెట్‌వర్క్‌ని (వీపీఎస్‌) క్రియేట్‌ చేసుకుని వెబ్‌లో విహరించొచ్చు.

కాస్పెర్స్ స్కీ సేఫ్ కిడ్స్ : పేరుకు తగ్గట్టే మ‌న పిల్ల‌ల భ‌ద్ర‌తను ఈ యాప్​ కాపాడుతుంది. జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ స‌దుపాయం కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. పిల్ల‌లు ఫోన్ చూసే స‌మ‌యాన్ని త‌గ్గించ‌డం, హానిక‌రమైన వెబ్​సైట్‌ల‌ను బ్లాక్ చేయ‌డం వంటికి ఈ యాప్ ద్వారా చేయవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.