ETV Bharat / science-and-technology

Whatsapp New Features : వాట్సాప్​ అడ్మిన్​లకు సూపర్​ పవర్​​.. ఇకపై పూర్తి నియంత్రణ వారిదే!

author img

By

Published : Aug 7, 2023, 2:58 PM IST

whatsapp latest feature
whatsapp admin review feature

Admin Review Feature For Whatsapp Group : ప్రముఖ మెసేజింగ్​ ప్లాట్​ఫామ్​ వాట్సాప్​ 'అడ్మిన్​ రివ్యూ ఫీచర్​' పేరుతో మరో కొత్త ఫీచర్​ను తమ యూజర్స్​ కోసం తేనుంది. దీనితో ఒక్కోసారి గ్రూప్​ అడ్మిన్​లు వాట్సాప్​ గ్రూప్​లో అందుబాటులో లేకపోయినా.. సంబంధిత గ్రూపులో జరిగే సంభాషణలను నియంత్రించవచ్చని వాబీటాఇన్ఫో వెబ్​సైట్​ తెలిపింది.

Admin Review Feature In WhatsApp : వినియోగదారుల భద్రత, గోప్యతే లక్ష్యంగా ప్రముఖ మెసేజింగ్​ ప్లాట్​ఫామ్​ వాట్సాప్​.. కొత్త అప్డేట్లు, ఫీచర్లు తెస్తూ యూజర్స్​కు మరింత దగ్గరవుతోంది. ఇప్పటికే ఎన్నో అప్డేట్​లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్​ తాజాగా మరో సరికొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టనుంది. అదే 'అడ్మిన్​ రివ్యూ ఫీచర్'​. కాగా, ఈ ఫీచర్​ గ్రూపు చాట్లల్లో మాత్రమే పనిచేయనుంది. ముఖ్యంగా గ్రూప్​ అడ్మిన్​ల కోసం దీనిని రూపొందించారు. అయితే ప్రస్తుతానికి బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్​ను.. మున్ముందు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్​ పనిచేస్తున్నట్లు వాట్సాప్​ అప్డేట్​లను సమీక్షించే వెబ్​సైట్​ Wabetainfo వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో గ్రూప్​ అడ్మిన్​లు ఒక్కోసారి తాము గ్రూపుల్లో అందుబాటులో లేకున్నా సరే, తాము నిర్వహించే గ్రూపుల్లో ఇతర సభ్యులు చేసే పోస్టులు, జరిగే సంభాషణలు, చర్చలపై పూర్తి నియంత్రణను కలిగి ఉండొచ్చని తెలిపింది.

ఎలా పనిచేస్తుంది..?
WhatsApp New Features Today : వాబీటాఇన్ఫో రిపోర్ట్​ ప్రకారం.. ఈ నయా ఫీచర్​ను ఆస్వాదించేందుకు గ్రూప్​ అడ్మిన్​లు ముందుగా గ్రూప్​ సెట్టింగ్స్​ స్క్రీన్​లోకి వెళ్లి పలు సెట్టింగ్స్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్​ను అడ్మిన్​లు ఎనేబుల్ చేసుకున్న తర్వాత గ్రూప్​ సభ్యులు గ్రూప్​లో వచ్చిన అసభ్యకర మెసేజ్​లను ఈ ఫీచర్​ సాయంతో గ్రూప్​ అడ్మిన్​కు చాట్​ రూపంలో రిపోర్ట్​ చేయవచ్చు. అలా రిపోర్ట్​ చేసిన మెసేజ్​ను డిలీట్​ చేసే అధికారం గ్రూప్​ అడ్మిన్​కు ఉంటుంది. ఆ సందేశం అందరి చాట్​లోనూ డిలీట్​ అవుతుంది. అంతేకాకుండా గ్రూప్​లో మరోసారి అలాంటి సందేశాలు పంపకుండా సంబంధిత సభ్యుడిని గ్రూప్​ అడ్మిన్​ మందలించవచ్చు.. లేదా అతడిని గ్రూప్​ నుంచి తొలగించవచ్చు.

WhatsApp Admin Features : గ్రూపులోని ప్రతి సభ్యుడు ఏదైనా సందేశాన్ని రిపోర్ట్​ చేయాలనుకుంటే గ్రూప్ అడ్మిన్​కు మెసేజ్​ ఆప్షన్స్​లోకి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. అలా గ్రూప్​ సభ్యులు రిపోర్ట్​ చేసే అన్నీ గ్రూప్​ ఇన్ఫో స్క్రీన్​లోని ఓ సెక్షన్​లో సేవ్​ అయి ఉంటాయి. వీటిని గ్రూప్​ అడ్మిన్​లు రివ్యూ చేసుకోవచ్చు.

ఏంటి లాభం..?
Usage Of Admin Review In WhatsApp : ఈ ఫీచర్​ సాయంతో గ్రూపుల్లో ఆరోగ్యవంతమైన చర్చ జరిగే ఆస్కారం ఉంటుందని.. అలాగే అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పలు సందేశాలను పంపే వారిపై పూర్తి నియంత్రణను విధించే అధికారం గ్రూప్​ అడ్మిన్​కు ఈ ఫీచర్​ కల్పించనుందని Wabetainfo​ పేర్కొంది. ఈ ఫీచర్​తో గ్రూప్​ సభ్యులు పంపే మెసేజ్​లను రివ్యూ కూడా చేయవచ్చు. అలాగే​ అడ్మిన్​లు గ్రూప్​లో అందుబాటులో లేనప్పుడు జరిగే సంభాషణలపై ఓ కన్నేసి ఉంచవచ్చు.

భవిష్యత్తులో అందరికీ..
WhatsApp New Update 2023 : గ్రూప్ చాట్‌ల కోసం రూపొందించిన ఈ 'అడ్మిన్ రివ్యూ ఫీచర్'​ను కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే ఈ ఫీచర్​ను అందరికీ అందుబాటులోకి తేనుంది వాట్సాప్​. మొత్తంగా రాబోయే ఈ సరికొత్త టూల్​​తో గ్రూప్​ అడ్మిన్​లు తాము నిర్వహించే వివిధ గ్రూపులను మేనేజ్​ చేసే సాధనంగా ఈ ఫీచర్​ ఉపయోగపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.