ETV Bharat / science-and-technology

ప్రేయసిని మిస్సవుతున్నారా? అయితే కిస్సింగ్ డివైజ్ మీ కోసమే

author img

By

Published : Feb 27, 2023, 1:09 PM IST

kissing device china
kissing device china

దూరంగా ఉన్న లవర్స్ ముద్దు పెట్టేందుకు సరికొత్త యంత్రం మార్కెట్లోకి వచ్చింది. ఈ కిస్సింగ్ డివైజ్​ ద్వారా ముద్దు పెట్టుకుంటే దగ్గర నుంచి ముద్దు పెట్టుకున్న ఫీలింగ్ కలుగుతుందట. మరి ఆ కిస్సింగ్ డివైజ్ గురించి ఓసారి తెలుసుకుందామా.

Kissing Device China : ప్రస్తుత కాలంలో సాంకేతికత విపరీతంగా పెరిగిపోయింది. ఇంటి పనులు చేసేందుకు రోబోలు, కృత్రిమ మేథ చాట్​జీపీటీ వంటి టెక్నాలజీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే చాలా మంది ప్రస్తుత కాలంలో ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా బిజీగా ఉంటున్నారు. ప్రియురాలు, భార్యను విడిచిపెట్టి దూరంగా వెళ్లాల్సి వస్తోంది. అయితే దూరంగా ఉన్న లవర్స్, భార్యాభర్తలు ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకునేందుకు వీలుగా 'కిస్సింగ్ డివైజ్​'ను కనిపెట్టింది చైనాలో ఓ విశ్వవిద్యాలయం. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఈ కిస్సింగ్ డివైజ్​కు సిలికాన్ లిప్స్ అమర్చి ఉంటాయి. ఈ డివైజ్​ను ఉపయోగించడానికి వినియోగదారులు మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత ఛార్జింగ్ పోర్ట్‌కు కేబుల్‌తో ఈ డివైజ్‌ను కనెక్ట్ చేయాలి. లవర్, భార్యతో పెయిర్ అవ్వాలి. ఆ తర్వాత వీడియో కాల్ చేసి డివైజ్​పై ముద్దులు పెట్టుకోవచ్చు. వీటికి ప్రెజర్ సెన్సార్లు పెట్టారు. వాటిని ముద్దు పెట్టుకుంటే నిజంగా కిస్ పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది.

ఈ కిస్సింగ్ డివైజ్​ పేటెంట్ కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు డివైజ్​ సృష్టికర్త జియాంగ్​. 2023 జనవరితో పేటెంట్​ ముగుస్తుంది. చైనాలోని గ్లోబల్ టైమ్స్‌ ఈ డివైజ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ముద్దు పెట్టుకున్నప్పడు ఉండే ప్రెజర్‌తో పాటు టెంపరేచర్‌నూ ఫీల్ అయ్యేలా ఈ పరికరాన్ని తయారు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భలే ఫన్నీగా ఉందని కొందరు కామెంట్లు పెడుతుంటే.. మరి కొందరు ఇదేం డివైజ్ రా బాబూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చైనా ఆన్‌లైన్ షాపింగ్ యాప్​లో ఈ కిస్సింగ్ డివైజ్ అందుబాటులో ఉంది. దీని ధర 288 యువాన్లు. అంటే భారత కరెన్సీలో రూ. 3,427. ఇదే తరహాలో 2016లోనే మలేసియాకు చెందిన ఇమాజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ 'కిస్సింగర్'​ అనే డివైజ్​​ను కనిపెట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.