ETV Bharat / science-and-technology

Instagram Twitter Competitor : ట్విట్టర్​కు పోటీగా ఇన్​స్టాగ్రామ్​ 'థ్రెడ్స్​'.. లాంఛ్​ ఎప్పుడంటే?

author img

By

Published : Jul 4, 2023, 2:11 PM IST

Instagram Twitter Rival : మైక్రో బ్లాగింగ్ సైట్​ ట్విట్టర్​కు పోటీగా మెటా కంపెనీ ఓ సరికొత్త యాప్​ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. థ్రెడ్స్​ పేరుతో తీసుకొస్తున్న ఈ బ్లాగింగ్ యాప్ అచ్చంగా ట్విట్టర్ తరహా ఫీచర్లతో ఉంటుందని టాక్​. లాంఛ్​ ఎప్పుడంటే..

Meta to launch Threads app
Meta to launch Twitter like app called Threads

Instagram Twitter Competitor : మెటా కంపెనీ సరికొత్త మైక్రో బ్లాగింగ్​ యాప్​ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. థ్రెడ్స్​ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్​.. ప్రస్తుతం మార్కెట్​ లీడర్​గా ఉన్న ట్విట్టర్​కు గట్టి పోటీని ఇస్తుందని టెక్​​ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్విట్టర్​లానే ఉంటుందా?
Instagram Twitter Rival : మెటా తన థ్రెడ్స్​ మైక్రో బ్లాగింగ్​ ఫ్లాట్​ఫామ్​ను ఈ వారంలోనే లాంఛ్​ చేయనున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో ట్విట్టర్​ తరహా ఫీచర్లు ఉంటాయని టాక్​ వినిపిస్తోంది. కానీ దీనిపై ఇంత వరకు మెటా యాజమాన్యం అధికారికంగా స్పందించలేదు.

ఇన్​స్టాగ్రామ్​ బ్రాండ్​పై తీసుకువస్తున్న ఈ థ్రెడ్స్​ యాప్​లో ట్విట్టర్ తరహా ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో టెక్ట్స్​ రూపంలో ఉన్న పోస్టులు పెట్టవచ్చు, లైక్​ చేయవచ్చు. అలాగే కామెంట్​, షేర్​ చేసే వెసులుబాటు కూడా ఉన్నట్లు యాప్​ స్టోర్​ లిస్టింగ్​లోని స్క్రీన్​షాట్​ ద్వారా తెలుస్తోంది.

ఇన్​స్టాగ్రామ్​ యూజర్​నేమ్​తోనే..
Threads Instagram : థ్రెడ్స్​ యాప్​ను ఇన్​స్టాగ్రామ్​ యూజర్ ​నేమ్​తోనే వినియోగించుకోవచ్చు. అలాగే ఇన్​స్టాగ్రామ్​లో మనం ఫాలో అయ్యేవారినే.. ఇక్కడ కూడా ఫాలో కావచ్చు. అయితే ఈ విషయంపై ఇన్​స్టాగ్రామ్​ యాజమాన్యం మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది.

ట్విట్టర్​కు మస్క్​ దెబ్బ!​
Twitter vs Instagram : ట్విట్టర్​ను ఎలాన్​ మస్క్​ సొంతం చేసుకున్న తరువాత ఆ సంస్థలో అనేక మార్పులు చేశారు. ట్విట్టర్​ పాలసీలో అనేక మార్పులు, చేర్పులు చేశారు. కొత్త ట్వీట్లను చూడడంలో యూజర్లకు పరిమితులు విధించారు. త్వరలో కచ్చితంగా సైన్​ఇన్​ అయితే తప్ప ఇతరులు ఎవ్వరూ ట్విట్టర్​ను వాడలేని విధంగా మార్పులు చేస్తామని ప్రకటించారు. ఇవన్నీ కూడా యూజర్లకు చాలా ఇబ్బందిగా మారాయి. అందుకో వారు ఇతర ప్రత్యామ్నాయ సోషల్​ మీడియా వేదికల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా మెటా కంపెనీ.. ట్విట్టర్​కు పోటీగా థ్రెడ్స్​ అనే పేరుతో ఓ సరికొత్త మైక్రో బ్లాగింగ్​ సైట్​ను తీసుకురావడానికి సిద్ధమైంది.

పెద్ద ఎత్తున ప్రచారం!
ట్విట్టర్​ అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా దానికి మంచి యూజర్​ ఫాలోయింగ్​ ఉంది. అందుకే ఫేస్​బుక్​ మాతృసంస్థ మెటా.. థ్రెడ్స్​ యాప్​ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పెద్దపెద్ద సెలబ్రిటీలు, ఇన్​ఫ్లూయెన్సర్లు ఈ యాప్​ గురించి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇంక 2 రోజుల్లోనే లాంఛ్​!
Meta to launch Threads : థ్రెడ్స్​ యాప్​ మరో రెండు రోజుల్లో అంటే జులై 6న లాంఛ్​ కానున్నట్లు పలు పత్రికలు కథనాలు రాశాయి. ఇప్పటికే ట్విట్టర్​కు పోటీగా మాస్టోడాన్​, బ్లూస్కై లాంటివి ప్రారంభమయ్యాయి. కానీ అవేవీ అంతగా యూజర్లను ఆకట్టుకోలేకపోయాయి.

ఇన్​స్టాగ్రామ్ 'థ్రెడ్స్​​' రీచ్​ అవుతుందా?
మెటా కంపెనీ అండర్​లో ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​ ఉన్నాయి. రోజూ దాదాపు 3 బిలియన్​ యూజర్లు వీటిని వినియోగిస్తున్నారు. కనుక ఈ యూజర్​ బేస్​తో మైక్రో బ్లాగింగ్​ యాప్ థ్రెడ్స్​ను కూడా సక్సెస్​ చేయాలని మెటా భావిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.