ETV Bharat / science-and-technology

'ఫ్రీ' యాంటీ వైరస్​ టూల్స్ తెచ్చిన కేంద్రం.. సైబర్​ దాడులకు చెక్ పెట్టేయండిలా​!

author img

By

Published : Jun 10, 2023, 6:36 PM IST

Updated : Jun 11, 2023, 9:18 AM IST

Free Antivirus Tools : యూజర్ల డేటా లక్ష్యంగా జరుగుతున్న సైబర్​ దాడులను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా యాంటీ వైరస్​లను అందుబాటులోకి తెచ్చింది. వీటితో మాల్​వేర్​లను మీ మొబైల్​, కంప్యూటర్​లతో సహా బ్రౌజర్​ ఎక్స్​టెన్షన్స్​, స్టోరేజ్​ డివైజ్​లను, యాప్​ల నుంచి తొలగించి.. వాటిని సురక్షితం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం పూర్తి కథనం చదవండి.

Cyber Swachhta Kendra Portal anti virus tools
Free Antivirus Tools by govt

'ఫ్రీ' యాంటీ వైరస్​ టూల్స్ తెచ్చిన కేంద్రం.. సైబర్​ దాడులకు చెక్ పెట్టేయండిలా​!

Free Antivirus Tools : ఈ డిజిటల్​ యుగంలో సైబర్​ దాడులు సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యంగా యూజర్ల డేటాను లక్ష్యంగా చేసుకుని సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలీ కమ్యునికేషన్​ (డాట్​) అనేక ఉచిత యాంటీ వైరస్​ సాఫ్ట్​వేర్స్​ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్​ఎంఎస్​ నోటిఫికేషన్స్​ కూడా పంపిస్తోంది.

ఉచితంగా యాంటీ వైరస్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు www.csk.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెక్యూరిటీ టూల్స్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ కంప్యూటర్లతోపాటు ఆండ్రాయిడ్‌ ఫోన్లకు సీఎస్‌కే అందిస్తున్న వివిధ కంపెనీల యాంటీ వైరస్‌ డౌన్‌లోడ్ లింక్‌లు కనిపిస్తాయి.

సైబర్​ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్​
కేంద్ర ప్రభుత్వం సైబర్​ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్​ (Cyber Swachhta Kendra Portal) ద్వారా ప్రతి ఒక్కరూ ఉచితంగా మాల్​వేర్​ డిటెక్షన్​ టూల్స్​ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ పోర్టల్​ను 'బాట్​నెట్​ క్లీనింగ్​ అండ్​ మాల్​వేర్​ అనాలసిస్​ సెంటర్'​ అని కూడా అంటారు. ఇది కంప్యూటర్​ ఎమర్జన్సీ రెస్పాన్స్​ టీమ్​ నేతృత్వంలో, ఇంటర్​నెట్​ సర్వీస్ ప్రొవైడర్స్​తో, యాంటీ వైరస్​ కంపెనీలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత యాంటీ వైరస్​ల సహాయంతో యూజర్లు తమ సెల్​ఫోన్​, కంప్యూటర్​ డివైజ్​లను మాల్​వేర్స్​ నుంచి రక్షించుకోవచ్చు.

బాట్​నెట్ ఇన్ఫెక్షన్​ అంటే ఏమిటి?
మాల్​వేర్​ సోకిన స్మార్ట్​ఫోన్లు లేదా కంప్యూటర్ల లాంటి డివైజ్​ల నెట్​వర్క్​నే 'బాట్' అంటారు. ఒకసారి ఒక కంప్యూటర్​కి మాల్​వేర్​ సోకి, అది బాట్​నెట్​కు అనుసంధానం అయిపోతే.. ఇక అప్పటి నుంచి ఆ కంప్యూటర్​లోని సమాచారం మొత్తాన్ని మాల్​వేర్..​ హ్యాకర్స్​కు అందిస్తూ ఉంటుంది. మాల్​వేర్​ ఎటాక్​ జరిగిన తరువాత, హ్యాకర్లు.. మన డివైజ్​లకు స్పామ్​ మెసేజ్​లు పంపిస్తూ ఉంటారు. అలాగే మన ఫోన్​ల నుంచి వెళ్లే కాల్స్​ను, మెసేజ్​లను బ్లాక్​ చేయగలుగుతారు. మరీ ముఖ్యంగా చాలా సున్నితమైన సమాచారాలను సైతం, అంటే మన నెట్​ బ్యాంకింగ్​ వివరాలను, యూజర్​ నేమ్స్​, పాస్​వర్డ్స్​ను కూడా తెలుసుకోగలుగుతారు.

బాట్​ దాడులు ఎలా జరుగుతాయ్​?

  • ఇన్ఫెక్టెడ్​ ఈ-మెయిల్​ని ఓపెన్​ చేయడం
  • ఈ-మెయిల్ లేదా వెబ్​సైట్​లోని​ హానికరమైన లింక్​లను క్లిక్​ చేయడం
  • విశ్వసనీయత లేని సోర్స్​ నుంచి ఫైల్స్​ను డౌన్​లోడ్​ చేయడం
  • సెక్యూర్​ కాని పబ్లిక్​ వై-ఫై లను ఉపయోగించడం
  • పై కారణాల వలన మన డివైజ్​లు బాట్ దాడులకు గురయ్యే అవకాశం ఉంటుంది.

సెల్​ఫోన్​, కంప్యూటర్​ల నుంచి మాల్​వేర్​, బాట్​నెట్​లను తొలగించడం ఎలా?

  • ముందుగా సీఎస్​కే వెబ్​సైట్​ https://www.csk.gov.in/ కి వెళ్లాలి.
  • 'సెక్యూరిటీ టూల్స్'​ పై క్లిక్​ చేయాలి.
  • మీకు నచ్చిన యాంటీవైరస్​ కంపెనీని ఎంచుకోవాలి
  • డౌన్​లోడ్​ బటన్​ క్లిక్​ చేసి, యాంటీ వైరస్​ను దిగుమతి చేసుకోవాలి.
  • విండోస్​ యూజర్లు : ఈ-స్కాన్​ యాంటీ వైరస్​, కె సెవెన్​ సెక్యూరిటీ, క్విక్ హీల్​ లాంటి యాంటీ వైరస్​ టూల్స్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • ఆండ్రాయిడ్​ వినియోగదారులు : గూగుల్​ ప్లేస్టోర్​కి వెళ్లి 'ఎమ్​ కవచ్​ 2' అని గానీ సెర్చ్ చేయాలి.
  • ముఖ్యంగా సీ-డాక్​ హైదరాబాద్​ వారు అభివృద్ధి చేసిన ఈ మాల్​వేర్​ టూల్స్​ను మీరు డౌన్​లైడ్​ చేసుకోవచ్చు.
  • ఇలా డౌన్​లోడ్​ చేసుకున్న యాంటీ వైరస్ టూల్స్..​ మీ డివైజ్​ల్లో ఉన్న మాల్​వేర్​లను తొలగిస్తాయి.

యూఎస్​బీ ప్రతిరోధ్​, యాప్​ సంవిధ్​ అప్లికేషన్స్​ డౌన్​లోడ్​ చేసుకోండి
సీఎస్​కే పోర్టల్​లో 'యూఎస్​బీ ప్రతిరోధ్'​, 'యాప్ ​సమ్​విద్'​ అనే రెండు సెక్యూరిటీ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. USB Pratirodh ​అనేది డెస్క్​టాప్​ టూల్​. అయితే ఇది ఫోన్​లోనూ, పెన్​డ్రైవ్​లోనూ ఉన్న మాల్​వేర్​ను, ఎన్​క్రిప్ట్​ డేటాను నిరోధించగలుగుతుంది. ​

విండోస్​ యూజర్లు AppSamvidను ఇన్​స్టాల్​ చేసుకోవాలి. ఇది కేవలం వెరిఫైడ్​ ఫైల్స్​ను మాత్రమే అనుమతిస్తుంది. ఇవి వైరస్​, మాల్​వేర్​, ట్రోజన్​ల నుంచి సిస్టమ్​ను రక్షిస్తుంది. యూజర్లు పటిష్టమైన పాస్​వర్డ్​లను పెట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఇవీ చదవండి :

Last Updated :Jun 11, 2023, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.