ETV Bharat / science-and-technology

మీ ఫోన్​లో వైరస్​ ఉందని తెలుసుకోవడం ఎలా?

author img

By

Published : Oct 16, 2021, 10:27 AM IST

smartphone virus
smartphone virus

స్మార్ట్​ఫోన్​ అంటే ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు లాకర్​ లాంటిది. అందులో వైరస్​ చేరడం అంటే ఇంట్లో దొంగలు పడటమే. తీరని నష్టం కలిగిస్తుంది. మీ స్మార్ట్​ఫోన్​కు వైరస్​ (Smartphone Virus) సోకిందని అనుమానంగా ఉంటే.. కచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయమే. అయితే మీ స్మార్ట్​ఫోన్​లో మాల్​వేర్​ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడం (Smartphone Virus Detection) ఎలానో చూడండి.

కరోనా మహమ్మారి అనంతరం మన జీవితాల్లో స్మార్ట్​ఫోన్​ల పాత్ర మరింత కీలకంగా, క్రియాశీలకంగా మారింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో వాయిస్​, వీడియో, మెసేజ్​ల రూపంలో సందేశాలను పంపించుకోగలం. ఇంట్లోనే ఉండి ఆఫీస్​ పని, షాపింగ్ చేసుకోవచ్చు. ఎంటర్​టైన్​మెంట్ పొందగలం. కాబట్టి ఫోన్​లో వైరస్​ సమస్య (Smartphone Virus) ఉంటే వెంటనే పరిష్కారం కోసం చూడాలి. లేదంటే తీరని నష్టం తప్పదు.

ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే స్మార్ట్​ఫోన్​లను లక్ష్యంగా చేసుకొని తమ అవసరాల కోసం వాడుకుంటారు హ్యాకర్లు మోసగాళ్లు. అందుకోసం హానికర కోడ్​లు వినియోగించి స్మార్ట్​ఫోన్​లోకి వైరస్​ను చొప్పిస్తారు. ట్రోజన్ దాడులు చేస్తారు.

వైరస్​లు, మాల్​వేర్​ నుంచి స్మార్ట్​ఫోన్​ను కాపాడుకోవడం ఎలా? (Smartphone Virus Detection)

వైరస్​, మాల్​వేర్​ బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని రూల్స్​ను పాటించాలి. యాప్​ స్టోర్​ లేదా గూగుల్​ ప్లే స్టోర్​ వంటి విశ్వసనీయ సోర్సెస్​ నుంచే నమ్మదగిన యాప్​లను మాత్రమే డౌన్​లోడ్ చేయాలి. ఏదైనా యాప్​ను డౌన్​లోడ్​ చేసే ముందు యూజర్​ రివ్యూలను చదవాలి. ఆయా యాప్​లు అడిగే అనుమతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

మీ స్మార్ట్​ఫోన్​కు వైరస్​ సోకిందని తెలుసుకోవడం ఎలా? (Signs of Malware on Phone)

  • ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అత్యుత్తమ విధానాలు పాటించినా.. వైరస్​ లేదా మాల్​వేర్​ మీ స్మార్ట్​ఫోన్​లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఫోన్​లో వైరస్​ ఉందని ఇలా తెలుసుకోవచ్చు..
  • మీ ఫోన్​లో ఊహించని ఛార్జీలు కట్ అవుతున్నాయంటే వైరస్​ (Mobile Virus Check) సోకినట్లే లెక్క. ప్రీమియం టెక్స్ట్​ మెసేజ్​లు, ఫోన్​ కాల్స్​ చేయడం, యూప్​లో కొనుగోళ్ల ద్వారా హానికర యాప్​లు ఆర్జిస్తాయి.
  • భరించలేని యాడ్​లు దర్శనమిస్తుంటే స్మార్ట్​ఫోన్​ యాడ్​వేర్​ బారినపడిందని అర్థం చేసుకోవచ్చు.
  • మాల్​వేర్​, ట్రోజన్.. స్మార్ట్​ఫోన్​ నుంచి ఇతరులకు స్పామ్​ టెక్స్ట్​ మెసేజ్​లు పంపించగలవు. దానివల్ల మీ కాంటాక్ట్స్​లో ఉన్న వారి ఫోన్​లు కూడా వైరస్​ బారినపడే ప్రమాదం ఉంది.
  • క్రమంగా స్మార్ట్​ఫోన్​ పెర్​ఫార్మమెన్స్​ తగ్గిపోవడం
  • స్మార్ట్​ఫోన్​లో వైరస్​లు, మాల్​వేర్​ కొత్త యాప్​లను (Malicious Apps) డౌన్​లోడ్​ కూడా చేయగలవు.
  • ఈ యాప్​లు, మెసేజ్​లు అపారమైన డేటాను వినియోగించగలవు. ఇలాంటి ఘటనలనూ అనుమానించాల్సిందే.
  • బ్యాటరీ సామర్థ్యం, పనితీరు పడిపోవడం

ఇదీ చూడండి: కరోనాను ఆసరాగా చేసుకుని హ్యాకింగ్.. జాగ్రత్త సుమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.