ETV Bharat / science-and-technology

How to Change Truecaller Name : ట్రూ కాలర్​లో మీ పేరు మార్చుకోవచ్చు.. మీకు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 3:25 PM IST

Change Truecaller Name
Truecaller

How to Change Truecaller Name in Telugu : మీరు ట్రూకాలర్ యాప్ వాడుతున్నారా? అయితే కొన్నిసార్లు ఈ యాప్​లో అవతలివారి పేర్లతో పాటు మీ పేర్లను తప్పుగా సూచించడం జరగుతుంది. మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైందా అయితే సింపుల్​గా ఆన్​లైన్​లో మీ పేరును సరిచేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. అది ఎలానో మీరే తెలుసుకోండి.

Change Your Name on Truecaller : ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కాలర్​ ఐడీ యాప్​గా ..​ ట్రూ కాలర్​ను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేటి ఆధునిక కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాల(Cyber Frauds)ను దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఈ యాప్​ను ఫాలో అవుతున్నారనే చెప్పుకోవచ్చు. మన కాంటాక్ట్ లిస్ట్​లో లేని వ్యక్తులు కాల్ చేసినప్పుడు.. వారి వివరాలను తెలియజేస్తుందీ యాప్. ఫోన్ రింగ్​ అవడానికి ముందే మనకు ఎవరు కాల్ చేస్తున్నారో ఇట్టే చెప్పేస్తుంది.

How to Change Your Truecaller Name in Online : అయితే కొన్నిసార్లు ట్రూ కాలర్ యాప్(Truecaller APP) లో ​యూజర్ పేరు తప్పుగా ఉంటుంది. లేదంటే.. మరో యూజర్ తన పేరు మార్చుకొని.. నిక్ నేమ్ పెట్టుకోవాలని అనుకోవచ్చు. ఇలాంటి వారు.. ట్రూ కాలర్​లో తమ పేరు ఎలా మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికోసమే ఈ స్టోరీ. ఈ సింపుల్​ టిప్స్​ తో ఇప్పుడే ట్రూ కాలర్ మీ పేరును మార్చుకోండి.

How to Change Truecaller Name with Mobile App :

మొబైల్ యాప్ ద్వారా మీ ట్రూ కాలర్ పేరు ఎలా మార్చుకోవాలో చూద్దాం..

  • మొదట మీ మొబైల్​లో Truecaller యాప్​ని ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత మీ మొబైల్ స్క్రీన్ పై లెఫ్ట్ కార్నర్​లో ఉన్న ప్రొఫైల్ ఐకాన్​పై నొక్కాలి.
  • అనంతరం మీ ప్రొఫైల్ విభాగంలోకి వెళ్లి.. 'Complete Your Profile' అనే బటన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీరు Truecallerలో ప్రదర్శించాలనుకుంటున్న కొత్త పేరును నమోదు చేయాలి.
  • పేరు మార్చిన తర్వాత 'Save' ఆప్షన్​ పై క్లిక్ చేయాలి.
  • ఇలా మార్చిన తర్వాత.. మారిన పేరును వెంటనే ప్రొఫైల్​లో చూపుతుంది.
  • ఇతర ట్రూకాలర్ వినియోగదారులకు చూపించడానికి కొంత సమయం పడుతుంది.

ట్రూకాలర్​లో కొత్త ఫీచర్​.. ఆటోమెటిక్​ కాల్ ఆన్సర్​.. అవతలి వ్యక్తి మాటలు మీ స్క్రీన్​పై టెక్స్ట్ రూపంలో..

వెబ్ సైట్​ ద్వారా మార్చుకోండిలా..

పేరు మార్చుకోవడానికి ప్రత్యేకంగా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలా..? అని కొందరు అనుకుంటారు. ఇలాంటి వారికి మరో ఆప్షన్ కూడా ఉంది. అదే వెబ్ సైట్. కంప్యూటర్​ లో Truecaller వెబ్​సైట్ లోకి వెళ్లి.. పేరు ఈజీగా మార్చుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

How to Change Your Truecaller Name Using Web Browser :

  • మొదట మీరు Truecaller వెబ్‌సైట్‌కి వెళ్లి.. టాప్ రైట్ కార్నర్​లో ఉన్న 'Sign in' ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత, మీ మెయిల్​ ద్వారా లాగిన్ అయ్యి.. 'any option from those' అనే దానిపై క్లిక్ చేయాలి.
  • మీ మొబైల్ నంబర్​ను, అలాగే ఏ నంబర్ పేరును మార్చాలనుకుంటున్నారో దానిని సెర్చ్ చేయండి. ఆపై 'search option'పై నొక్కాలి.
  • అనంతరం 'Suggest Name' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • కొత్త పేరును టైప్ చేసి.. 'Submit' బటన్​పై క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది.

ట్రూకాలర్‌ కొత్త ప్లాన్.. ఫ్యామిలీ మొత్తానికి ఒకటే సబ్‌స్క్రిప్షన్‌

Trucaller: ట్రూ కాలర్‌ నయా ఫీచర్స్‌ మీకోసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.