ETV Bharat / science-and-technology

సీక్రెట్ ఫొటోలు, వీడియోలు దాచేందుకు గూగుల్​ కొత్త ఫీచర్

author img

By

Published : Dec 4, 2021, 12:21 PM IST

Updated : Dec 4, 2021, 12:42 PM IST

Google Photos Locked Folder: రహస్యంగా ఉంచాలనుకునే ఫొటోలను, వీడియోలను ప్రత్యేకంగా సేవ్​ చేయడానికి గూగుల్​ ఓ అధ్బుతమైన ఫీచర్​ను తీసుకొచ్చింది. దాని పేరే లాక్డ్​ ఫోల్డర్​. ఇది ప్రస్తుతం పిక్సెల్​ ఫోన్లకు మాత్రమే పరిమితం కాగా.. త్వరలో ఆండ్రాయిడ్​ ఫోన్ల అన్నింటిలో ఈ సౌకర్యాన్ని తీసుకురానుంది. దీనితో యూజర్లు తమ ఫోటోలను, వీడియోలను ఫోల్డర్​లో సపరేట్​గా సేవ్​ చేసుకోవచ్చు.
Google Photos Locked Folder
గూగుల్​ ఫోటో లాక్డ్​ ఫోల్డర్​ ఫీచర్​

Google Photos Locked Folder: ఫొటోలు, వీడియోల విషయంలో చాలామంది జాగ్రత వహిస్తారు. వాటికి లాక్​ వేసి, వేర్వేరు పిన్​లను పెట్టుకుని మర్చిపోతారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని గూగుల్​ ఓ సరికొత్త ఫీచర్​ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. అదే గూగుల్​ ఫొటోలకు లాకింగ్​ ఫోల్డర్ ఆప్షన్​. సంస్థ గతంలో ఈ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకువచ్చినా.. కొన్ని కారణాల వల్ల దానిని గూగుల్​ ఫిక్సెల్​ స్మార్ట్​ఫోన్లకు మాత్రమే పరిమితం చేసింది. అయితే త్వరలోనే ఈ ఫీచర్​ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆండ్రాయిడ్​ స్మార్ట్​ఫోన్​లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని స్మార్ట్​ఫోన్​లకు ఈ ఫొటోస్ లాక్డ్​ ఫోల్డర్​ ఫీచర్​ను తీసుకురానున్నట్లు గూగుల్​ ఆక్టోబర్​లోనే ప్రకటించింది. ప్రయోగాత్మకంగా ఇప్పటికే కొన్ని ఫోన్​లలో ఈ ఫీచర్​ ఉందని తెలిపిన గూగుల్​.. ఆండ్రాయిడ్​ వినియోగదారులకు ఈ సౌకర్యం కల్పిస్తే ఎక్కువ మంది లాభపడుతారని పేర్కొంది.

ఈ ఏడాది మేలో జరిగిన ఇన్​పుట్​, అవుట్​పుట్​ ఈవెంట్​లో ఫొటోస్​ లాకింగ్ ఫీచర్​ను పిక్సెల్​ స్మార్ట్​ఫోన్​లలో ప్రవేశపెట్టింది గూగుల్​. అయితే ఇప్పుడు మరిన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్​ ప్రస్తుతం ఆండ్రాయిడ్ పోలీస్​లో వర్క్​ అవుతుంది. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్, వన్‌ప్లస్ 7లాంటి రెండు స్మార్ట్​ఫోన్​లలో ఆండ్రాయిడ్ 11పై కూడా పని చేస్తుంది. ఐఓఎస్​ లో ఈ ఫీచర్​ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో దీనిని ప్రారంభించవచ్చని తెలుస్తోంది.

Google Photos Locked Folder Use..

ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే.. ఆండ్రాయిడ్​ యూజర్లు ఫొటోలను, వీడియోలను లాక్​ చేసి ఉండే ఫోల్డర్​లలో సెపరేట్​గా సేవ్​ చేసుకోవచ్చు. వాటికి ప్రత్యేకంగా పాస్​వర్డ్​ను కూడా క్రియేట్​ చేసుకోవచ్చు. ఒకసారి ఫొటోస్​, వీడియోస్​ను లాక్​ చేస్తే అవి మీ గూగుల్​ ఫొటోలో కానీ, ఇతర గ్యాలరీ యాప్​లలో కానీ చూసేందుకు వీలుండదు.

How To Save Media In Google Photos Locked Folder..

లాక్డ్ ఫోల్డర్​లో ఎలా సేవ్​ చేయాలి?

ముందుగా ఈ ఫీచర్​ను పొందాలి అంటే యాప్​ను అప్​డేట్​ చేసుకోవాలి. ఫీచర్​ అందుబాటులోకి వచ్చిందని గుర్తిస్తే.. మనం ఏ ఫోటోలను, వీడియోలను అయితే లాక్డ్​ ఫోల్డర్​లోకి తరలించాలని అనుకుంటున్నామో.. వాటిని సెలెక్ట్​ చేసుకోవాలి. ఆ తరువాత మూవ్​ ఐటెమ్స్​ ను నొక్కాలి. అనంతరం లాక్డ్​ ఫోల్డర్​లోకి తరలించాలి. లాక్ చేసిన ఫోల్డర్‌లోని మీడియాను బ్యాకప్ తీసుకోవడం కానీ.. గూగుల్​ ఫోటోల ద్వారా షేర్​ చేయడం కానీ సాధ్యపడదు.

ఇవీ చూడండి:

ఆండ్రాయిడ్​లో అదిరే ఫీచర్లు- డిజిటల్​ కార్​ కీ, సరికొత్త విడ్జెట్లు ఇంకెన్నో..

ఆండ్రాయిడ్​లో 6 అద్భుత ఫీచర్లు- ఫోన్ టచ్ చేయకుండానే...

స్మార్ట్​ఫోన్​లో మీకే తెలియని ఫీచర్ల కోసం అదిరే యాప్​లు

Last Updated :Dec 4, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.