ETV Bharat / science-and-technology

Shortcuts in Gmail: జీమెయిల్‌ను 'అన్‌డూ' చేసేయండి!

author img

By

Published : Aug 4, 2021, 8:31 AM IST

కంగారులోనో ఇతర ఆలోచనలతోనో మెయిల్‌కు ఫైళ్లను అటాచ్‌ చేయకుండానే కొన్నిసార్లు సెండ్‌ చేసేస్తుంటాం. అలాంటప్పుడు జీమెయిల్​లో 'అన్​డూ' ఆప్షన్ ట్రై చేశారా? వీటితో పాటు మరికొన్ని షార్ట్​కట్లు(Shortcuts in Gmail) జీమెయిల్​లో అందుబాటులో ఉన్నాయి. వీటితో మీ పని మరింత సులభతరం అవుతుంది. వాటిపై ఓ లుక్కేయండి...

Shortcuts in Gmail
జీమెయిల్

ప్రస్తుత కాలంలో అత్యధిక మంది వినియోగించే ఈ-మెయిల్‌ సర్వీసుల్లో గూగుల్‌ సంస్థ అందించే జీమెయిల్‌ ముందుంటుంది. యూజర్‌ ఫ్రెండ్లీగా, సులువుగా మెయిళ్లు పంపుకునేందుకు అనువుగా ఉంటుంది. సెక్యూరిటీపరంగానూ యూజర్లకు పూర్తి భరోసా ఇస్తుంది. మెయిళ్లను పంపడం ఎలాగో చాలా సులభంగా నేర్చేసుకోవచ్చు. అయితే జీమెయిల్‌ సర్వీస్‌లో ఉండే కొన్ని ఫీచర్లు, సెట్టింగ్స్‌ను సమర్థవంతంగా వాడుకుంటే ఇన్‌బాక్స్, ఇతర టాస్క్‌ల పనితీరును ఇంకా ప్రభావవంతంగా మార్చుకోవచ్చని టెక్‌ వర్గాలు పేర్కొన్నాయి. అలానే కీబోర్డ్ షార్ట్‌కట్స్‌(Shortcuts in Gmail) కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

జీమెయిల్‌లో 'అన్‌డూ'

కంగారులో పొరపాట్లు చేయడం సహజం. ఏదో పని ఒత్తిడిలోనో, ఇతర ఆలోచనలతోనో మెయిల్‌ చేసేటప్పుడు ఫైల్‌నుగానీ, ఇతర కొన్ని వివరాలను అటాచ్‌ చేయకుండా సెండ్‌ చేసేస్తుంటారు. అయితే కొన్ని షార్ట్‌కట్స్‌ను వినియోగించి మీరు పంపిన మెయిల్‌ను 'అన్‌డూ' చేయవచ్చు. అయితే డీఫాల్ట్‌గా కేవలం ఐదు సెకన్లలోనే అన్‌డూ చేసే ఆప్షన్‌ సెట్‌ చేసి ఉంటుంది. దీనిని జీమెయిల్‌లోని సెట్టింగ్స్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేసి 'అన్‌డూ' సెట్టింగ్స్‌లోకి వెళ్లి టైమ్‌ను కాస్త పొడిగించుకోవచ్చు. సమయాన్ని 30 సెకన్ల వరకు పెంచుకునే వీలుంది. అయితే టైమ్‌ను సెట్‌ చేసుకోవడం వల్ల మీరు పంపే జీమెయిల్‌ కాస్త ఆలస్యంగా రిసీవర్‌కు చేరుతుంది. అత్యవసరమైన మెయిల్స్‌ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది.

అవసరంలేని ఈమెయిల్స్‌ను బ్లాక్‌.. ఎక్కువ ప్రైవసీ

అవసరంలేని ఎన్నో మెయిల్స్‌ వస్తుంటాయి. అలాంటప్పుడు డైరెక్ట్‌గా సెండర్‌నే బ్లాక్‌ చేసే ఆప్షన్‌ను జీమెయిల్‌ కల్పించింది. బ్లాక్‌ చేయడం వల్ల మీ ఇన్‌బాక్స్‌లోకి కాకుండా స్పామ్‌ ఫోల్డర్‌లోకి అలాంటి మెయిల్స్‌ వెళ్లిపోతాయి. వెబ్‌లో మీ జీమెయిల్‌తో సైన్‌ఇన్ అయితే ప్రైవసీకి ఆటంకం కలుగుతుందేమోనని అనుమానం కలుగుతుంది. వేర్వేరు సేవల కోసం ప్రత్యామ్నాయ మెయిల్‌ అడ్రెస్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. సింపుల్‌గా మీ మెయిల్‌ అడ్రస్‌కు ప్లస్ సైన్‌ను యాడ్‌ చేసుకుంటే సరిపోద్ది.. అన్ని ఈమెయిల్స్‌ ఈ అడ్రస్‌కీ వస్తున్నాయంటే ఏమేమి సేవలు లీక్‌ అయ్యాయో తెలిసిపోతుంది.

అత్యంత రహస్యమైనది..

వాట్సాప్‌ మాదిరిగా మెసేజ్‌లకు ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ ఉండదు. ఇలాంటప్పుడు అత్యంత రహస్యమైన మెయిల్స్‌ పంపించాలంటే కాస్త ఆందోళనగా ఉంటుంది. ఇలాంటి దానికి గూగుల్ పరిష్కారం చూపింది. కాన్ఫిడెన్షియల్ మోడ్‌ను ఎనేబుల్‌ చేసుకునే ఆప్షన్‌ ఉంది. కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌లో 'ఎక్స్‌పైరీ డేట్‌'ను సెట్‌ చేసుకోవడం వల్ల .. మీరు పంపిన ఈమెయిల్‌ రిసీవర్‌ ఇన్‌బాక్స్‌ నుంచి అదృశ్యం అయిపోతుంది. అలానే మెయిల్‌ అందుకున్న యూజర్‌ మీ మెయిల్‌ను ఫార్వర్డ్‌, కాపీ, ప్రింటింగ్‌, డౌన్‌లోడింగ్‌ ఆగిపోతుంది. దీని కోసం ఎస్‌ఎంఎస్‌ పాస్‌కోడ్‌ను కూడా సెట్‌ చేసుకోవచ్చు. అయితే ఇది కంపల్సరీ కాకుండా ఆప్షనల్‌గా గూగుల్‌ ఇచ్చింది.

ఇన్‌బాక్స్‌ కంట్రోల్స్‌ కోసం కీబోర్డ్ షార్ట్‌కట్స్‌..

యాప్‌ అయినా వెబ్‌ అయినా కీబోర్డ్ షార్ట్‌కట్స్‌ ఉంటే సులభంగా ఆపరేట్‌ చేయవచ్చు. Shift+Esc క్లిక్‌ చేస్తే మెయిన్‌ విండో వస్తుంది. ఈమెయిల్స్‌ను త్వరగా పంపించాలంటే Ctrl+Enter ప్రెస్‌ చేస్తే సరిపోయే. ఓల్డ్‌ డ్రాఫ్ట్‌ డిస్కార్డ్‌ కోసం Ctrl+Shift+D. అలానే Ctrl+Shiftతోపాటు C క్లిక్‌ చేస్తే మెయిల్‌ CC రిసిప్ట్స్‌ , Ctrl+Shiftతోపాటు B ప్రెస్‌ చేస్తే BCC రిసిప్ట్స్‌ ఓపెన్ అవుతుంది. జీమెయిల్‌లో అన్ని షార్ట్‌కట్స్‌ను చూడాలంటే సింపుల్‌గా Shift+? క్లిక్‌ చేస్తే క్లియర్‌గా కనిపిస్తాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.