ETV Bharat / science-and-technology

ఇంటిపైన ల్యాండ్ అయ్యే 'ఈ-ప్లేన్' ట్యాక్సీ.. ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ జర్నీ

author img

By

Published : Mar 1, 2023, 6:50 PM IST

రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్‌ కష్టాలు.. వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మరి ఈ చిక్కులు లేకుండా నగరంలో ఎక్కడికైనా ఆకాశంలో ఎగిరిపోతే..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది త్వరలో నిజం కాబోతుంది. ఆ కథేంటో తెలుసుకుందాం పదండి!

E plane coming to house terrace
E plane coming to house terrace

ఇంటిపైన ల్యాండ్ అయ్యే 'ఈ-ప్లేన్'

మెట్రో నగరాల్లో ట్రాఫిక్​ కష్టాలు అన్ని ఇన్నీ కావు. బెంగళూరు లాంటి నగరాల్లో అయితే పరిస్థితి మరీ ఆధ్వానం. 10 కిలోమీటర్లు దూరం ప్రయాణించడానికి ఒక్కోసారి గంటకుపైగా పడుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్​ పెట్టేలా కొత్త టెక్నాలజీని తీసుకువస్తున్నారు తమిళనాడులోని ఐఐటీ మద్రాస్​ విద్యార్థులు. నగరంలో ఎక్కడికైనా గాలిలో ప్రయాణించేలా 'ఈ-ప్లేన్​'ను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం తయారీ దశలో ఉన్న 'ఈ-ప్లేన్'​ను 2024 చివరకు లేదా 2025 ఏడాది ప్రారంభానికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 'ఈ-ప్లేన్'​లో ఐదుగురు కూర్చుని ప్రయాణించేలా రూపొందిస్తున్నామని చెబుతున్నారు ఐఐటీ మద్రాస్​ ఎరోనాటికల్ ఇంజినీరింగ్​ ప్రొఫెసర్​ సత్యన్ చక్రవర్తి.

"సాధారణంగా మనం మొబైల్ యాప్ ద్వారా టాక్సీని బుక్ చేయగానే.. కారు వచ్చి మనల్ని ఎక్కించుకుని తీసుకువెళ్లి మన గమ్యస్థానంలో దించుతుంది. అచ్చం అలానే యాప్ ద్వారా 'ఈ-ప్లేన్' ట్యాక్సీకి కాల్ చేస్తే.. విమానం వచ్చి మనల్ని ఆకాశమార్గంలో తీసుకువెళ్తుంది. ఇది మైదాన ప్రాంతంతో పాటు మన ఇంటి పైభాగంలో కూడా ల్యాండ్ అవుతుంది. 'ఈ-ప్లేన్​' వల్ల గంటకు పైగా పట్టే దూరాన్ని 5-10 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. ఇందులో ప్రయాణించడానికి సాధారణ ట్యాక్సీకి వెచ్చించే ఖర్చు కన్నా సుమారు 2-3 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తోంది."

--సత్యన్​ చక్రవర్తి, ఐఐటీ మద్రాస్​ ప్రొఫెసర్​

ప్రస్తుతానికి 'ఈ-ప్లేన్​'కు ఇంజిన్​, సీట్లను రూపొందించే పనిలో ఉంది మద్రాస్ ఐఐటీ పరిశోధకుల బృందం. వచ్చే ఆరు నెలల్లోనే దీనిని పరీక్షిస్తారు. అనేక దశల పరీక్షల అనంతరం ప్రభుత్వం నుంచి సేఫ్టీ సర్టిఫికెట్​ వచ్చిన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ ప్రక్రియంతా పూర్తి కావడానికి సుమారు సంవత్సరం పైగా పడుతుందని అంచనా.

E plane coming to house terrace
ఐఐటీ మద్రాస్​ విద్యార్థులు రూపొందించిన ఈ ప్లేన్​

'ఈ-ప్లేన్'​తో పాటుగా సరకు రవాణా కోసం మరో విమానాన్ని 2023లోనే అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికల్లో ఉన్నారు మద్రాస్ ఐఐటీ పరిశోధకులు. తైయూర్​ ప్రాంగణంలో దీని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ విమానాలు బ్యాటరీలను ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఫుల్​ ఛార్జింగ్​ కావడానికి కేవలం 15 నిమిషాలే పడుతుంది.

ఇవీ చదవండి : ఫుల్​ జోష్​తో ఏనుగు బర్త్​డే పార్టీ.. వారికి స్వీట్స్ పంచిపెట్టిన ఆండాళ్

మూడేళ్లుగా బాలికపై తండ్రి అత్యాచారం.. పరీక్ష రాయకుండా ఠాణాకెళ్లి ఫిర్యాదు.. తల్లి కూడా అలా చేసిందంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.