ETV Bharat / science-and-technology

వేల ఏళ్లనాటి డైనోసార్​ గుడ్డుపై రీసెర్చ్- ఏం తెలిసిందంటే...

author img

By

Published : Dec 22, 2021, 7:25 PM IST

Dinosaur embryo: వేల ఏళ్లనాటి డైనోసార్​ గుడ్డు శిలాజాన్ని చైనాలో ఉంది. దీన్ని బేబీ ఇంగ్లియాంగ్ అని పురాతత్వ శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. లోపల కోడి పిల్ల మాదిరిగా డైనోసార్‌ పిల్ల రూపం స్పష్టంగా కనిపిస్తున్న ఈ గుడ్డు శిలాజం 27 సెంటీమీటర్ల పొడవు ఉంది.

dinosaur embryo found in China, డైనోసార్​ గుడ్డు శిలాజం
వేల ఏళ్లనాడి డైనోసార్​ గుడ్డు శిలాజం

Dinosaur embryo: కోట్ల ఏళ్ల క్రితం మరుగునపడిపోయి భూమి పొరల్లో నిక్షిప్తమైన డైనోసార్ గుడ్డు శిలాజం ఆధునిక పక్షుల పరిణామ రహస్యాలను విశదీకరిస్తోంది. దాదాపు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం నాటి జీవికి చెందిన గుడ్డు శిలాజాన్ని తూర్పు చైనాలో 2వేల సంవత్సరంలో గుర్తించారు. క్రెటేషియస్ కాలంలో జీవించిన దంతాలులేని థైరోపాడ్‌ డైనోసార్‌కు చెందినదిగా భావిస్తున్న ఈ గుడ్డు శిలాజాన్ని ఫుజియన్‌లో ఉన్న ఇంగ్లియాంగ్‌ స్టోన్ నేచురల్‌ హిస్టరీ మ్యూజియమ్‌లో భద్రపరిచారు. ఈ గుడ్డు శిలాజాన్ని బేబీ ఇంగ్లియాంగ్ అని పురాతత్వ శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. లోపల కోడి పిల్ల మాదిరిగా డైనోసార్‌ పిల్ల రూపం స్పష్టంగా కనిపిస్తున్న ఈ గుడ్డు శిలాజం 27 సెంటీమీటర్ల పొడవు ఉంది. లోపల పిల్ల డైనోసార్‌ 17 సెంటీమీటర్లు ఉంటుందని తేల్చారు. మూడేళ్ల నుంచి ఈ శిలాజాన్ని పరిశోధిస్తున్న చైనీస్, బ్రిటిష్‌, కెనడియన్ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ప్రకృతి సంరక్షించిన ఉత్తమ గుడ్డు శిలాజం ఇదేనని చెప్పారు.

Dinosaur egg

గుడ్డు లోపల ఉన్న జీవిగా భావిస్తున్న థైరోపాడ్ డైనోసార్‌ పిల్లకు ఈకలు ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. ఈ గుడ్డు శిలాజం పొదగక ముందు ఇప్పుడు మనం చూస్తున్న పక్షి పిండాలను పోలి ఉందని వివరించారు. ఇప్పుడున్న పక్షులు పొదిగే విధానం లక్షల ఏళ్ల క్రితం జీవించిన డైనోసార్ల నుంచి పరిణామ క్రమంలో వచ్చిందని భావిస్తున్నట్లు చైనా యూనివర్శిటీ ఆఫ్ జియోసైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ జింగ్ లిడా వెల్లడించారు. ఈ శిలాజంపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: హెచ్ఐవీ బాధిత మహిళ శరీరంలో ఒమిక్రాన్ పుట్టుక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.