ETV Bharat / science-and-technology

Chandrayaan 3 Soft Landing Again : ఈసారి మనుషులతో 'చంద్రయాన్​'.. ఇస్రో విక్రమ్ 'రిటర్న్' జర్నీ సక్సెస్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 12:12 PM IST

Updated : Sep 4, 2023, 12:41 PM IST

Chandrayaan 3 Soft Landing Again : చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పరిశోధనలకు పంపిన చంద్రయాన్​-3 ల్యాండర్​ను ఇస్రో మరోసారి సాఫ్ట్​ ల్యాండింగ్​ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను షేర్​ చేసింది.

Chandrayaan 3 Soft Landing Again
Chandrayaan 3 Soft Landing Again

Chandrayaan 3 Soft Landing Again : జాబిల్లి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు వెళ్లిన చంద్రయాన్​-3లో భాగమైన విక్రమ్​ ల్యాండర్​ను మరోసారి విజయవంతంగా స్టాఫ్​ ల్యాండింగ్​ చేసింది ఇస్రో. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఇస్రో.. తన ఎక్స్​(ట్విట్టర్​) ఖాతాలో షేర్​ చేసింది.

దాదాపు 40 సెం.మీ పైకి లేచి..
Chandrayaan 3 Second Soft Landing : చంద్రయాన్​-3 ప్రయోగంలోని విక్రమ్​ ల్యాండర్​కు అప్పగించిన లక్ష్యాలను అధిగమించిందని ఇస్రో వెల్లడించింది. శాస్త్రవేత్తల ఆదేశానుసారం ఇంజిన్లను మండించినట్లు తెలిపింది. దాదాపు 40 సెం.మీ వరకు ల్యాండర్​ పైకి లేచిందని, 30-40 సెం.మీ పక్కన సురక్షితంగా ల్యాండ్​ అయినట్లు తెలిపింది. మానవ మిషన్లు సురక్షితంగా తిరిగిరావడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.

  • Chandrayaan-3 Mission:
    🇮🇳Vikram soft-landed on 🌖, again!

    Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment.

    On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away.… pic.twitter.com/T63t3MVUvI

    — ISRO (@isro) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అన్ని వ్యవస్థలు సక్రమంగానే..
Chandrayaan 3 Lander Update : ల్యాండర్​లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాలకు ఇది నాందిగా తెలిపింది. హాప్ ఎక్స్‌పరిమెంట్ విజయవంతమైనట్లు తెలిపిన ఇస్రో.. చేస్ట్‌, ఐఎల్ఎస్ఏ పరికరాలు ఫోల్డ్ అయ్యాయని చెప్పింది. పరీక్ష పూర్తి అయిన తర్వాత అవి మళ్లీ యథావిథిగా పనిచేస్తున్నట్లు వివరించింది.

స్లీప్​ మోడ్​లోకి 'ప్రజ్ఞాన్'​ రోవర్​..
Chandrayaan 3 Sleep Mode : చంద్రయాన్-3లోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేసుకొని విశ్రాంతికి సిద్ధమయ్యాయని ఇస్రో ఇటీవలే ప్రకటించింది. తొలుత ప్రజ్ఞాన్​ రోవర్‌ను స్లీప్​ మోడ్​లోకి పంపినట్లు ఇస్రో.. శనివారం రాత్రి వెల్లడించింది. దానికి అమర్చిన పేలోడ్‌ పనులను నిలిపేసినట్లు ఇస్రో పేర్కొంది.

  • Chandrayaan-3 Mission:
    The Rover completed its assignments.

    It is now safely parked and set into Sleep mode.
    APXS and LIBS payloads are turned off.
    Data from these payloads is transmitted to the Earth via the Lander.

    Currently, the battery is fully charged.
    The solar panel is…

    — ISRO (@isro) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరో రెండు వారాల్లో..
Pragyan Rover Sleep Mode : "ప్రజ్ఞాన్​ రోవర్‌ తన లక్ష్యాలను పూర్తి చేసుకుంది. దాన్ని ఇప్పుడు సురక్షిత ప్రదేశంలో నిలిపి ఉంచి, స్లీప్​ మోడ్​లోకి పంపేశాం. అందులోని ఏపీఎక్స్‌ఎస్‌, లిబ్స్‌ పరికరాలను స్విచ్ఛాఫ్‌ చేశాం. ఈ రెండు సాధనాల నుంచి డేటా.. ల్యాండర్‌ ద్వారా భూమికి చేరింది" అని ఇస్రో పేర్కొంది.

ప్రస్తుతం విశ్రాంతి దశలోకి వెళ్లిన రోవర్‌లోని బ్యాటరీలు పూర్తిగా రీఛార్జ్​ అయ్యాయని ఇస్రో తెలిపింది. మళ్లీ ఈ నెల 22న శివశక్తి పాయింట్‌ వద్ద సూర్యోదయం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆ రోజున సూర్యకాంతిని అందుకునేలా రోవర్‌ సోలార్​ ప్యానెల్​ను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. దాని రిసీవర్‌ను ఆన్‌ చేసి పెట్టినట్లు పేర్కొంది. అన్నీ సజావుగా సాగితే మరికొన్ని రోజుల పాటు ప్రజ్ఞాన్‌ తన పరిశోధనలను కొనసాగించనుంది. లేదంటే భారతదేశపు ప్రతినిధిగా చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోనుంది.

Chandrayaan 3 Sleep Mode :​ సెంచరీ కొట్టిన ప్రజ్ఞాన్​​.. నిద్రలోకి రోవర్​, ల్యాండర్!

Chandrayaan 3 ILSA : చంద్రుడిపై ప్రకంపనలను గుర్తించిన 'ఇల్సా'​.. సవ్యంగానే 'రోవర్' సెర్చ్​ ఆపరేషన్!​

Last Updated :Sep 4, 2023, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.