ETV Bharat / science-and-technology

Best Smartwatch Under 2000 : దసరాకు మంచి స్మార్ట్​వాచ్ కొనాలా?.. రూ.2000 బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్స్​ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 1:50 PM IST

Best Smartwatch Under 2000 In Telugu : దసరా పండుగ వేళ మంచి స్మార్ట్​వాచ్​ కొందామని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ కేవలం రూ.2000 మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. మార్కెట్​లో ప్రస్తుతం బోట్​, జెబ్రోనిక్స్​, బోల్ట్​, నోయిస్​, ఫాస్ట్రాక్​ లాంటి టాప్​బ్రాండ్​ స్మార్ట్​వాచ్​లు ఇదే బడ్జెట్​లో లభిస్తున్నాయి. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Best Smartwatch October 2023
Best Smartwatch Under 2000

Best Smartwatch Under 2000 : నేటి యువత స్మార్ట్​వాచ్​లు ధరించడానికే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ఈ స్మార్ట్​వాచ్​లు చూడడానికి మంచి స్టైలిష్​ లుక్​లో ఉండడమే కాదు.. ఫిట్​నెస్, హెల్త్ ట్రాకింగ్​ల​కు కూడా బాగా ఉపయోగపడతున్నాయి. మరి ఈ పండుగ సీజన్​లో మీరు కూడా బడ్జెట్​లో మంచి స్మార్ట్​వాచ్​ కొనాలని ఆశిస్తున్నారా? అయితే మీకు గుడ్​ న్యూస్​. ప్రస్తుతం మార్కెట్​లో టాప్​ బ్రాండెడ్​ స్మార్ట్​వాచ్​లు రూ.2000 బడ్జెట్​లోనే లభిస్తున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

BoAt Wave Call Smart Watch Features :
ఈ బోట్​ స్మార్ట్​వాచ్​లో 1.69 అంగుళాల ఫుల్​ హెచ్​డీ టచ్​ డిస్​ప్లే ఉంది. ఈ వాచ్ డీప్​ బ్లూ, యాక్టివ్​ బ్లాక్​, కరేబియన్ గ్రీన్​, మౌవ్​ అనే కలర్ వేరియంట్స్​లో లభిస్తుంది. ముఖ్యంగా దీనిలో బిల్ట్​-ఇన్​-స్పీకర్​, బ్లూటూత్​ ఫీచర్స్​ ఉన్నాయి. బోట్​ కంపెనీ దీనినే 'వేవ్ కాల్​' ఫీచర్ అంటోంది. ఈ స్మార్ట్​వాచ్​ బ్యాటరీ లైఫ్ 2 రోజులు ఉంటుంది. అయితే బ్లూటూత్ కాల్స్ చేయకపోతే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ బోట్ స్మార్ట్​వాచ్​లో హార్ట్​ రేట్​ మోనిటర్​, స్లీప్​ ట్రాకర్​, SP2O ట్రాకర్​ లాంటి ఎన్నో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే రన్నింగ్​, సైక్లింగ్​, క్లైంబింగ్​, యోగా లాంటి ఎన్నో స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి.

BoAt Wave Call Smart Watch
బోట్​ వేవ్​ కాల్​ స్మార్ట్​వాచ్​

BoAt Wave Call Smart Watch Price :
ఈ బోట్​ స్మార్ట్​వాచ్​ ధర మార్కెట్​లో రూ.7,990 వరకు ఉంటుంది. కానీ ప్రస్తుతం అమెజాన్​లో 80% డిస్కౌంట్​తో, కేవలం రూ.1,599కే లభిస్తోంది.

Noise ColorFit Pulse Spo2 Smart Watch Specs :
ఈ నోయిస్​ స్మార్ట్​వాచ్​లో 1.4 అంగుళాల ఫుల్​ హెచ్​డీ టచ్​ డిస్​ప్లే ఉంది. దీని బ్యాటరీ లైఫ్ 10 రోజులు ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్​, ఐఓఎస్ ఫోన్లు రెండింటికీ కంపాటిబిలిటీ కలిగి ఉంది. ఈ నోయిస్​ స్మార్ట్​వాచ్​లో హార్ట్​ రేట్​ మోనిటర్​, స్లీప్​ ట్రాకర్​, SP2O ట్రాకర్​ సహా ఎన్నో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి.

Noise ColorFit Pulse Spo2 Smart Watch
నోయిస్​ కలర్​ఫిట్​ పల్స్​ స్మార్ట్​వాచ్​

Noise ColorFit Pulse Spo2 Smart Watch Price :
నోయిస్​ కలర్​ఫిట్​ పల్స్ స్మార్ట్​వాచ్ ధర మార్కెట్లో రూ.4,999 వరకు ఉంటుంది. కానీ అమెజాన్​లో ఇది ప్రస్తుతం రూ.2,199కే అందుబాటులో ఉంది.

Zebronics Drip Smart Watch Features :
ఈ జెబ్రోనిక్స్ స్మార్ట్​వాచ్​ లైట్​వెయిట్​ మెటల్ బాడీతో వస్తుంది. దీనిలోని వాయిస్​ అసిస్టెంట్​.. ఐఓఎస్​ సహా, ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా సపోర్ట్ చేస్తుంది.​ దీనిలోని 250mAh బిల్ట్​-ఇన్ బ్యాటరీని ఒక సారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 7 రోజులు పనిచేస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో హార్ట్​ రేట్​, Spo2, స్లీప్​ మానిటర్ సహా అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి.

Zebronics Drip Smart Watch
జెబ్రోనిక్స్ డ్రిప్​ స్మార్ట్​వాచ్​

Zebronics Drip Smart Watch Price :
మార్కెట్​లో ఈ జెబ్రోనిక్స్ డ్రిప్​ స్మార్ట్​వాచ్ ధర రూ.6,999 ఉంటుంది. కానీ ప్రస్తుతం అమెజాన్​లో ఇది కేవలం రూ.1,620కే లభిస్తోంది.

Fire Boltt Phoenix Pro Smart Watch Specs :
ఈ ఫైర్​ బోల్ట్​ ఫీనిక్స్ ప్రో స్మార్ట్​వాచ్​లో 1.39 అంగుళాల టీఎఫ్​టీ ఫుల్​ కలర్ టచ్​ స్క్రీన్​ ఉంది. దీనిలోని ఏఐ వాయిస్​ అసిస్టెంట్​ను ఉపయోగించి, మీ స్మార్ట్​ఫోన్​లోని సిరి/ గూగుల్ వాయిస్​ అసిసెంట్​లను వాడుకోవచ్చు.

Fire Boltt Phoenix Pro Smart Watch
ఫైర్​ బోల్ట్​ ఫీనిక్స్​ ప్రో స్మార్ట్​వాచ్​

Fire Boltt Phoenix Pro Smart Watch Price :
మార్కెట్​లో ఈ ఫైర్​ బోల్ట్​ ఫీనిక్స్ ప్రో స్మార్ట్​వాచ్ ధర రూ.11,999 ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆమెజాన్​లో ఇది కేవలం రూ.1,299కే లభిస్తోంది. ఇది దీ బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు.

New Fastrack Reflex Beat Plus Features :
న్యూ ఫాస్ట్రాక్​ రిఫ్లెక్స్​ బీట్​ ప్లస్ స్మార్ట్​వాచ్​లో 1.69 అంగుళాల ఆల్ట్రావీయూ డిస్​ప్లే ఉంది. దీనిలో 60 వరకు బిల్ట్​ ఇన్​ స్పోర్ట్స్​ మోడ్స్​ ఉన్నాయి.

New Fastrack Reflex Beat plus
న్యూ ఫాస్ట్రాక్​ రిఫ్లెక్స్​ బీట్​ + స్మార్ట్​వాచ్​

New Fastrack Reflex Beat Plus Price :
న్యూ ఫాస్ట్రాక్​ రిఫ్లెక్స్​ బీట్ ప్లస్ ధర రూ.3,495 వరకు ఉంటుంది. అయితే ఇది అమెజాన్​లో కేవలం రూ.1,795కే అందుబాటులో ఉంది.

Best Cars Under 10 Lakhs : దసరాకు కారు కొనాలా?.. రూ.10 లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు ఇవే!.. ఫీచర్స్​ అదుర్స్​!

Apple India Festive sale : అదిరిపోయే డీల్స్​తో.. యాపిల్ ఫెస్టివల్​ సేల్​.. ఐఫోన్​, మ్యాక్​బుక్స్​పై భారీ డిస్కౌంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.