చవితి నైవేద్యాలు: గణనాథునికి ఇష్టమైన పూర్ణం బూరెలు!

author img

By

Published : Sep 19, 2021, 7:20 AM IST

Updated : Sep 19, 2021, 8:00 AM IST

Vinayaka Chavithi 2021: Purnam Burelu Recipe In Telugu

వినాయక చవితికి మరో స్పెషల్ వంటకం పూర్ణం బూరెలు. గణనాథునికి ఇష్టమైన ప్రసాదంగా చెప్పుకునే ఈ పూర్ణాలు తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. దీని తయారీ విధానాన్ని తెలుసుకోండిలా..

వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రకం నైవేద్యాలు చేస్తూ స్వామి వారికి మొక్కులు సమర్పిస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ పూర్ణం బూరెలు. ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!

కావాల్సినవి:

బియ్యం, మినప్పప్పు, సెనగపప్పు, బెల్లం- కప్పు చొప్పున, యాలకులు- అయిదారు, నెయ్యి- తగినంత, వంటసోడా- పావు చెంచా, ఉప్పు- తగినంత.

తయారీ విధానం:

బియ్యం, మినప్పప్పులను కలిపి కొన్ని గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత కాస్తంత ఉప్పు, వంటసోడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే విడిగా సెనగపప్పును కూడా నానబెట్టుకోవాలి. ఇది నానిన తర్వాత సరైన పాళ్లలో మరిన్ని నీళ్లు కలిపి పప్పు మెత్తబడకుండా పలుకులుగా ఉడికించాలి. మిగతా నీళ్లను తీసేయాలి. నీళ్లు పూర్తిగా పోయాక ఈ పప్పు, బెల్లం, యాలకులను గ్రైండర్‌లో వేసి రుబ్బాలి.

ఆ తర్వాత ఈ ముద్దను లడ్డూల్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇష్టమైతే కొబ్బరితురుము, జీడిపప్పు ముక్కలు కూడా కలిపి పెట్టుకోవచ్చు. ఈ లడ్డూలను మినప్పప్పు, బియ్యప్పిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. వేడివేడి బూరెల మధ్యలో సొట్ట చేసి ఆవు నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటాయి.

ఇదీ చూడండి.. vinayaka chavithi 2021: రుచికరమైన పల్లీ కొబ్బరి మోదక్

Last Updated :Sep 19, 2021, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.