రుచికరమైన చికెన్​ ఫ్రాంకీ చేసుకోండిలా..

author img

By

Published : Nov 16, 2020, 1:01 PM IST

Updated : Nov 16, 2020, 4:15 PM IST

preparing chicken pranky recipe
రుచికరమైన చికెన్​ ప్రాంకీ చేసుకోండి ఇలా ()

చికెన్​తో రకరకాల వంటలు చేసి బోర్ కొట్టిందా? అయితే చికెన్​ను గోధుమపిండితో కలిపి రుచికరమైన ఫ్రాంకీలను తయారు చేసుకోండి.

వెజ్​ ఫ్రాంకీలకంచే ఎంతో రుచిగా ఉండే చికెన్​ ఫ్రాంకీలను తయారు చేసే విధానం

కావాల్సినవి:

బోన్‌లెస్‌ చికెన్‌- అరకేజి (అర అంగుళం ముక్కల్లా కట్‌ చేసుకోవాలి), గోధుమపిండి- రెండు కప్పులు, ఉప్పు- తగినంత, నూనె-రెండు టేబుల్‌స్పూన్లు, మధ్యస్థంగా ఉండే ఉల్లిపాయలు- రెండు, అల్లంవెల్లులి ముద్ద- రెండు టీస్పూన్లు, ధనియాల పొడి- రెండు టీస్పూన్లు, పసుపు- అర టీస్పూన్‌, కారం- రెండు టీస్పూన్లు, మధ్యస్థంగా ఉండే టమాటాలు- రెండు, సన్నగా తరిగిన కొత్తిమీర- రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం- రెండు టేబుల్‌స్పూన్లు, గుడ్లు- నాలుగు

తయారీ:

  • గోధుమపిండిలో తగినన్ని నీళ్లు పోసి, కాస్త ఉప్పు వేసుకుని ముద్ద కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయ, టమాటాలను చిన్న ముక్కలుగా కోయాలి. కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మరో నిమిషంపాటు వేయించాలి.
  • ఇప్పుడు చికెన్‌ ముక్కలు వేసుకుని మూడు నిమిషాల పాటు వేయించాలి. తగినంత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం వేసి బాగా కలపాలి.
  • తర్వాత టమాటా ముక్కలు వేసి చికెన్‌ కాస్త ఉడికేవరకూ ఉంచాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీద ముక్కలు వేసుకుని పొడిగా అయ్యేంత వరకూ ఉడికించాలి.
  • ఈ మిశ్రమం మీద నిమ్మరసం పిండి, బాగా కలిపి పక్కనపెట్టాలి. ఇప్పుడు గోధుమపిండి ముద్దను ఎనిమిది భాగాలు చేసి, ఎనిమిది చపాతీలు చేయాలి.
  • పాన్‌ మీద ఒక్కో చపాతీనీ కాల్చాలి. గుడ్ల సొనను ఒక గిన్నెలో వేసుకుని బాగా కలిపి ఒక్కో చపాతీ మీద కొద్దిగా సొన వేసి కాల్చాలి. సొన చపాతీ మీదే వేయాలిగానీ దాన్ని దాటి పక్కలకు రాకుండా చూసుకోవాలి.
  • ఇప్పుడు చపాతీని తిరగేసి కింది భాగం కూడా బాగా కాల్చాలి. సొన భాగం పైకి వచ్చేలా చపాతీని పెట్టి చికెన్‌ మిశ్రమం వేయాలి.
  • దీని మీద ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ వెనిగర్‌, గ్రీన్‌ చట్నీలనూ చల్లాలి. ఇప్పుడు చపాతీని గట్టిగా చుట్టాలి.

అలంకరణకు:

సన్నగా తరిగిన ఉల్లిపాయలు-రెండు, చిల్లీ వెనిగర్‌-నాలుగు టీస్పూన్లు, గ్రీన్‌చట్నీ-ఎనిమిది టీస్పూన్లు.

Last Updated :Nov 16, 2020, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.