ETV Bharat / priya

సమ్మర్ స్పెషల్: మ్యాంగో చికెన్‌ కూర

author img

By

Published : Apr 4, 2021, 12:36 PM IST

mango chicken, chicken recipes
మ్యాంగో చికెన్, సమ్మర్ స్పెషల్ చికెన్

ప్రతి ఆదివారం చికెన్, మటన్, ఫిష్ ఉండాలనుకుంటారు మాంసం ప్రియులు. అలాగని ఎప్పుడూ ఒకేమాదిరిగా వండితే ఏమాత్రం ఇష్టపడరు. అందుకే రొటీన్​గా కాకుండా ఈ సారి కొత్తగా ట్రై చేయండి. ఈ వేసవిలో దొరికే మామిడికాయతో సమ్మర్ స్పెషల్ చికెన్​ కూర చేసి ఆస్వాదించండి.

వేసవికాలంలో దొరికే మామిడికాయతో రుచికరమైన చికెన్ కూరను తయారు చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం.

కావాల్సినవి: స్కిన్‌లెస్‌ చికెన్‌- కేజీ, ఉడికించిన పచ్చి మామిడికాయ గుజ్జు- కప్పు, పసుపు- టీస్పూన్‌, కారం- రెండు టేబుల్‌స్పూన్లు, ధనియాల పొడి- టీస్పూన్‌, జీలకర్ర పొడి- టీస్పూన్‌, నూనె- నాలుగు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి- ఆరు, చిన్నముక్కలుగా కోసిన ఉల్లిపాయలు- రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూన్‌, గరంమసాలా పొడి- టీస్పూన్‌, ఆమ్‌చూర్‌ పొడి- టీస్పూన్‌, ఉప్పు- తగినంత, కొత్తిమీర తురుము- టేబుల్‌స్పూన్‌.


తయారీ: గిన్నెలో మామిడికాయ గుజ్జు, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, గరంమసాలా పొడి, టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌ ముక్కలకు బాగా పట్టించి రెండు గంటలపాటు పక్కన పెట్టాలి. మందపాటి గిన్నెలో మిగిలిన నూనె పోసి వేడిచేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేంతవరకు వేయించాలి. తర్వాత అల్లంవెల్లులి పేస్టు, మసాలా పట్టించిన చికెన్‌ వేసి మూతపెట్టి మధ్యస్థంగా ఉండే మంట మీద పది నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు అరకప్పు నీళ్లు పోసి ఇరవై నిమిషాల పాటు ఉడికించి, నూనె పైకి తేలిన తర్వాత స్టవ్‌ కట్టేయాలి. చివరగా కొత్తిమీర తురుము వేయాలి. అంతే రుచికరమైన మ్యాంగో చికెన్ రెడీ అవుతుంది. అన్నం, చపాతీల్లోకి ఈ కూర చాలా బాగుంటుంది.

ఇదీ చదవండి: గోంగూరతో మటన్​.. చుక్కకూరతో చికెన్​...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.