ETV Bharat / priya

నోరూరించే 'బేసన్​ లడ్డూ'.. సులువుగా చేసేయండిలా!

author img

By

Published : Jun 14, 2020, 1:22 PM IST

భారత్​లోని అత్యంత ప్రత్యేకమైన వంటకాల్లో 'లడ్డూ' ఒకటి. అన్ని పండుగలకు ప్రతి ఇంట్లో తప్పకుండా దర్శనమిస్తుంది. అలాంటి ఈ వంటకాన్ని కొంచెం కొత్తగా, మరింత రుచిగా.. ఉత్తరాది పద్ధతిలో తయారు చేస్తే దానినే 'బేసన్​ లడ్డూ' అంటారు. నోరూరించే కమ్మని ఈ స్వీట్​ తయారీపై ఓ లుక్కేయండి..

make besan laddu at home
ఉత్తరాది బేసన్​ లడ్డు బలే రుచి

'బేసన్​ లడ్డూ'ను ఉత్తర భారత్​లో అన్ని పండుగలకు ప్రత్యేకంగా తయారు చేస్తారు. అలాగే ఇళ్లలో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు, పార్టీలకు దీన్ని ప్రత్యేక వంటకంగా వడ్డిస్తారు. ఈ స్వీట్​ తయారీ చాలా సులభం. శనగ పిండిని నెయ్యిలో వేయించి.. అందులో యాలకులు, చక్కెర పొడిని కలిపి, బంతిలా చుట్టి నోటిలో పెడితే... ఆహా అనిపిస్తుంది కదా! చదువుతుంటేనే నోటిలో నీళ్లు ఊరుతున్నాయా? మరెందుకు ఆలస్యం ఎలా చేయాలో మీరే చూడండి.

కావాల్సిన పదార్థాలు

చక్కెర-ముప్పావు కప్పు, యాలకులు-1 టీ స్పూన్​, నెయ్యి-అరకప్పు, జీడిపప్పు-2 నుంచి 3 టీ స్పూన్లు, శనగ పిండి- ఒకటిన్నర కప్పు, కిస్​ మిస్​-తగినన్ని.

ఇలా తయారు చేయాలి

బేసన్​ లడ్డూ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. ముందుగా ముప్పావు కప్పు చక్కెర, 1 టీస్పూన్​ యాలకులు మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత నెయ్యిలో రెండు నుంచి మూడు టీ స్పూన్ల జీడిపప్పు(కాజు)ను బంగారు రంగు వచ్చేంత వరకూ వేయించాలి. తర్వాత వాటిని ఓ కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగానే వేయించిన శనగ పిండిని నెయ్యిలో వేసి బాగా కలపాలి. అందులో కొద్ది కొద్దిగా చక్కెర పొడి మళ్లీ కలపాలి. కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బంతిలా చుట్టాలి. వాటి మీద కిస్​మిస్, కాజులతో అలంకరించుకోవాలి. అంతే రుచికరమైన బేసన్​ లడ్డూలు రెడీ. మీరూ తయారు చేసి మీ అనుభూతిని ఈటీవీ భారత్​తో పంచుకోండి.

ఉత్తరాది బేసన్​ లడ్డూ బలే రుచి

ఇదీ చూడండి: ఫుల్లుగా తినేయండి.. కరోనాను తరిమేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.