ETV Bharat / priya

చికెన్ 'సేమియా' బిర్యానీ.. రుచిచూస్తే అస్సలు వదలరు!

author img

By

Published : Mar 13, 2022, 12:41 PM IST

Updated : Mar 13, 2022, 2:34 PM IST

Chicken Semiya Biryani: చికెన్​ ఫ్రై, చికెన్​ కర్రీ, చికెన్​ లాలిపాప్స్​, తందూరి చికెన్​.. ఇలా అనేక రకాల ప్రత్యేక వంటకాలను నాన్​వెజ్​ ప్రియులు తినే ఉంటారు. కానీ ఎప్పుడైనా చికెన్​ సేమియా బిర్యానీ తిన్నారా.? మరి చికెన్​ సేమియా బిర్యానీ తయారీ విధానం ఎలానో చూసేయండి.

Chicken Semiya Biryani
చికెన్ సేమియా బిర్యానీ

Chicken Semiya Biryani: నాన్​వెజ్​ ప్రియులకు వాటితో చేసే ప్రత్యేక వంటకాలు అంటే చాలా ఇష్టం. కొత్తదనాన్ని కోరుకోవడంలో వారి తర్వాతే ఎవరైనా.. అయితే ఎప్పుడూ ఒకేలా చికెన్​ బిర్యానీ తినకుండా సేమియాతో కలిపి ఎప్పుడైనా తిన్నారా? అందుకే మరి చికెన్ సేమియా బిర్యానీ తయారీ విధానం ఓ సారి చూద్దాం.

Chicken Semiya Biryani
చికెన్ సేమియా బిర్యానీ

కావాల్సిన పదార్థాలు: చికెన్(250 గ్రాములు), అల్లం వెల్లుల్లి పేస్ట్​, పచ్చి మిరపకాయ ముక్కలు, కారం (ఒక చెంచా), గరం మసాలా (ఒక చెంచా), సేమియా (250 గ్రాములు), బిర్యానీ ఆకు, పెరుగు (ఒక కప్పు), పసుపు, ధనియాల పొడి తగినంత, సాజీరా, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి తగినంత, కొత్తి మీర, పుదీనా, నెయ్యి, ఉప్పు రుచికి సరిపడినంత, హోల్​ గరం​ మసాలా.

తయారీ విధానం: ముందుగా పొయ్యిపై ఉంచిన గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు వేయాలి. అందులో ఉప్పు, సేమియాను కూడా వేసి ఉడికించుకోవాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి.

పొయ్యిపై పాన్​లో నెయ్యి పోసి, మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, చికెన్ ముక్కలు, పెరుగు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి కలిపి మూతపెట్టి ఉడికించుకోవాలి. ఆ మిశ్రమానికి వడకట్టిన సేమియా మిశ్రమాన్ని కలిపి ఉడికించుకోవాలి. దానిపై కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు ఉండనివ్వాలి. రుచికరమైన సేమియా బిర్యానీ తయారీ పూర్తయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: పండగ పూట పసందైన రుచి 'గోంగూర మటన్'‌

Last Updated : Mar 13, 2022, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.