ETV Bharat / priya

నాన్​వెజ్​ ప్రియులారా.. చికెన్​ ఆమ్లెట్​ ఎప్పుడైనా రుచి చూశారా.!

author img

By

Published : Sep 28, 2021, 6:57 AM IST

Updated : Sep 28, 2021, 12:15 PM IST

చికెన్​ ఫ్రై, చికెన్​ కర్రీ, చికెన్​ లాలిపాప్స్​, తందూరి చికెన్​.. ఇలా అనేక రకాల ప్రత్యేక వంటకాలను నాన్​వెజ్​ ప్రియులు తినే ఉంటారు. కానీ ఎప్పుడైనా చికెన్​ ఆమ్లెట్ (CHICKEN OMELETTE)​ తిన్నారా.? మరి చికెన్​ ఆమ్లెట్​ తయారీ విధానం ఎలానో చూసేద్దాం..

Chicken Omelette
చికెన్​ ఆమ్లెట్​

నాన్​వెజ్​ ప్రియులకు వాటితో చేసే ప్రత్యేక వంటకాలు అంటే చాలా ఇష్టం. కొత్తదనాన్ని కోరుకోవడంలో వారి తర్వాతే ఎవరైనా.. అయితే ఎప్పుడూ గుడ్డుతో చేసే అమ్లెట్​ తిని బోర్​ కొట్టి వారు.. ఈసారి చికెన్​ ఆమ్లెట్​ను (CHICKEN OMELETTE) ట్రై చేయవచ్చు. దాని తయారీ విధానం ఓ సారి చూద్దాం.

చికెన్​ ఆమ్లెట్​ తయారీ విధానం..

ముందుగా స్టౌవ్​ వెలిగించి పాన్​ పెట్టి వేడి చేసుకోవాలి. ఒక పాత్రలో కోడి గుడ్డు పగలకొట్టి పక్కన పెట్టుకోవాలి. వేడైన పాన్​లో నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలను వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, టమోటా ముక్కలు, బోన్​లెస్​ చికెన్​, పుసుపు, గరంమసాలా, ఉప్పు వేసి కలిపి వేగనివ్వాలి. అనంతరం కొత్తిమేర, ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్డువేసి కలపాలి. బాగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకుంటే సౌత్​ ఇండియన్​ స్పెషల్​ చికెన్​ ఆమ్లెట్​ రెడీ..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కావాల్సిన పదార్థాలు..

  • చికెన్​ బోన్​లెస్​ 100 గ్రాములు
  • కోడి గుడ్లు 3
  • ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు
  • పచ్చిమిర్చి 1 స్పూన్​
  • టమోటా ముక్కలు పావు కప్పు
  • కొత్తిమేర తరిగింది పావు కప్పు
  • ఉప్పు రుచికి సరిపడినంత
  • పసుపు పావు స్పూన్​
  • గరంమసాలా పొడి పావు స్పూన్​

ఇదీ చూడండి: డిస్కో బ్రెడ్​ ఆమ్లెట్​.. రుచి చూస్తే వదలరు!

Last Updated : Sep 28, 2021, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.