ETV Bharat / priya

నోరూరించే చికెన్​ ఆమ్లెట్​ తిన్నారా..!

author img

By

Published : Apr 18, 2021, 1:07 PM IST

చికెన్​ ఫ్రై, చికెన్​ కర్రీ, చికెన్​ లాలిపాప్స్​, తందూరి చికెన్​.. ఇలా చాలా రకాల స్పెషల్స్​ తిని ఉంటాం. కానీ ఎప్పుడైనా చికెన్​ ఆమ్లెట్​ తిన్నారా.? అందుకే ఈ ఆదివారం మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. మరి చికెన్​ ఆమ్లెట్​ తయారీ విధానం చూసేద్దాం..

chicken amlet
చికెన్​ ఆమ్లెట్​

యమ్మీ యమ్మీ చికెన్​ ఆమ్లెట్​ తయారీకి కావాల్సిన పదార్థాలు..

బోన్​లెస్​ చికెన్​- 100 గ్రా, గుడ్డు- ఒకటి, పసుపు, ఉప్పు, కారం- తగినంత, ఉల్లిపాయ ముక్కలు- రెండు చెంచాలు, జీలకర్ర- పావు చెంచా, అల్లం తరుగు- పావు చెంచా, పచ్చిమిర్చి తరుగు- అరచెంచా, నూనె- తగినంత

తయారీ: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, చికెన్​ వీటన్నింటిని చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, చికెన్​, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పాన్​లో నూనె వేసుకొని అందులో గుడ్డు పగలకొట్టి అట్టు పోసుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న చికెన్​ ముక్కలను వేసుకొని రోల్​లా చుట్టుకుంటే సరి. సరికొత్త రుచితో చికెన్​ ఆమ్లెట్​ రెడీ.

ఇదీ చదవండి: ప్రతి మండలానికి ఒక ఫైర్ డిపార్ట్​మెంట్ ఉంది: హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.