ETV Bharat / priya

కూరగాయల రాజా 'వంకాయతో పిజా'!

author img

By

Published : Sep 21, 2020, 1:01 PM IST

'తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా.. వంకాయా!' అని ఓ సినీ కవీ ఊరికే రాయలేదు. వంకాయతో ఏం చేసిన అమృతమే. ఎంత తిన్నా అందేది పోషకమే. అందుకే, ఆ రుచికి ఇంకాస్త మజాను జోడించి రాజా వంకాయతో పిజా చేసేద్దాం రండి..

brinjol pizza recipe in telugu
కూరగాయల రాజా 'వంకాయతో పిజా'!

వంకాయ పిజా ఒక్కసారి రుచి చూస్తే శాకాహారులే కాదు, మాంసాహరులూ వదలరంతే... మరింకెందుకు ఆలస్యం రెసిపీ చూసేయండి..

కావాల్సినవి

వంకాయ- ఒకటి పెద్దది, పిజా సాస్‌- అర కప్పు, చీజ్‌ తురుము - పావుకప్పు, ఆలివ్‌లు - మూడు (చక్రాల్లా కోయాలి), నూనె- అరచెంచా, ఉప్పు- తగినంత.

తయారీ..

వంకాయలను కాస్త లావుగా చక్రాల్లా కోసి పెట్టుకోవాలి. ఆ ముక్కలకు నూనె రాసి పైన ఉప్పు చల్లాలి. రెండు నిమిషాల తరవాత వాటిపై పిజా సాస్‌, చీజ్‌ తురుము, స్లైసులుగా కోసిన ఆలివ్‌లు వేయాలి. ఈ ముక్కల్ని పెనంపై సన్ననిమంటపై కాల్చాలి. కాసేపటికి చీజ్‌ కరుగుతుంది. అప్పుడు పొయ్యి కట్టేయాలి. అంతే వేడివేడి వంకాయ పిజా సిద్ధం. దీన్ని అప్పటికప్పుడు తినేయొచ్చు.

ఇదీ చదవండి: 'సొరకాయ హల్వా' రెసిపీ చూసేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.