ఇవి తినండి.. ఏకాగ్రతను పెంచుకోండి!

author img

By

Published : Aug 21, 2021, 4:54 PM IST

Updated : Aug 21, 2021, 5:17 PM IST

memory

ఉరుకుల పరుగుల జీవితం వల్ల సాధారణంగా చాలా మందికి ఏకాగ్రత ఉండటం లేదు. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అయితే ఈ సమస్యను అధిగమించడానికి మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు. కొన్ని ఆహారాలు మెదడుకు పదును పెట్టి, ఏకాగ్రత పెంచుతాయని చెబుతున్నారు. మరి అవి ఏంటో చూద్దాం..

ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం. క్షణం తీరిక లేకుండా గడుపుతుండటం వల్ల ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందా? దీంతో జ్ఞాపకశక్తి మందగిస్తోందా? దేనిపైనా ఏకాగ్రత ఉండట్లేదా? మెదడుకు పదును పెట్టే పనులు తగ్గిపోయి.. ప్రతి దానికి ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్​పై ఆధారపడుతున్నారా? అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పండ్లు, కూరగాయలు..

మెదడుకు పనిపెట్టే వాటిలో తాజా పండ్లు, కూరగాయలు ముఖ్యమైనవి. అందుకే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్​ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి బ్రెయిన్​ను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్​ను చేపల నుంచి పొందవచ్చు. పండ్లతో ఇది పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు మనలో ఆకలి వేస్తున్న భావనను పోగొట్టి కొత్త హుషారును కలిగిస్తాయి. ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్​.. యాపిల్​, అరటి, బొప్పాయిలో ఎక్కువగా ఉంటాయి. బాదంపప్పు, బఠానీలు, పిస్తా కంటే.. అంజీరాలో ఈ యాసిడ్స్​ ఎక్కువగా ఉంటాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

డ్రైఫూట్స్​ అన్ని గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గించే లిపిడ్స్​ను మెరుగుపరుస్తాయి. అదే విధంగా ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి సరిపడ శక్తి అందుతుంది. ఇందుకోసం మనం తీసుకునే అల్పాహారంలో పీచు, మాంసకృత్తులు, కొవ్వులు సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి బ్రేక్​ ఫాస్ట్​ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు సమంగా ఉంటాయి.

"మన ఆకలికి, మెదడుకు చాలా రిలేషన్ ఉంది. క్యాలరీలు లేనప్పుడు, పోషక ఆహారాల లోపాల వల్ల ముఖ్యంగా బీ కాంప్లెక్స్​, విటమిన్స్​, జింక్​ లాంటి మైక్రో న్యూట్రియంట్​ డెఫిషియెన్సీ వల్ల ఏక్రాగత ఉండదు. మనం తీసుకునే డైట్​లో మెదడు 20శాతం క్యాలరీలను ఉపయోగిస్తుంది. కాబట్టి బ్రెయిన్​కు గ్లూకోజ్​ కావాలి. గ్లూకోజ్​ కార్బోహైడ్రేట్స్​లో దొరుకుతుంది. అయితే ఈ క్యాలరీ ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా మెదడుకు అందినప్పుడు చాలా హెల్తీగా ఉంటాం."

-డాక్టర్​ మల్లీశర్వీ.

ఏకాగ్రతను పెంచే ఆహారాల్లో గ్రీన్​ టీ చాలా ముఖ్యమైనది. ఇందులో అధిక శాతంలో ఉండే పాలిఫెనాల్స్​ రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. క్యాన్సర్​ రాకుండా చేస్తాయి. డార్క్​ చాక్లెట్​లో ఉండే కెఫిన్​ మానసికంగా ఉత్తేజితం చేయడమే కాకుండా ఏకాగ్రత పెంచేందుకు దోహదపడుతుంది.

మెదడుకు పనిపెట్టే వాటిలో వాల్​నట్​ కూడా కీలకమైనదే. ఇందులో యాంటీ ఆక్సైడ్స్​, విటమిన్లు, ఖనిజాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి మతిమరుపు స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. అందుకే ఇవి రోజు గుప్పెడు తింటే మంచిది.

"మనం తీసుకునే ఆహారంలో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్​ ఉండాలి. నాన్​ వెజిటేరియన్స్ చేపలు, వెజిటేరియన్స్​ నట్స్​ తీసుకోవాలి. ధాన్యం, పప్పులోనూ ఇవి లభిస్తాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్​లో కావాల్సినంత యాంటి ఆక్సిడెంట్స్​​ ఉండేలా చూసుకోవాలి. ఇవి డార్క్​ కలర్​ కూరగాయల్లో ఉంటాయి. టమాటా, వంకాయ, ఆరెంజ్​లో ఇవి దొరుకుతాయి. దీంతో మన శరీరంలో ఒత్తిడితో పోరాడుతుంది. మెదడు హెల్తీగా ఉంటుంది. బీకాంప్లెక్స్​, విటమిన్స్​ మెయిన్​గా సెంట్రర్​ నెర్వస్​ సిస్టమ్​కు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం తీసుకునే డైట్స్​ బ్యాలెన్స్​గా తీసుకుంటే మెదడు బాగా పనిచేస్తుంది."

-డాక్టర్​ మల్లీశర్వీ.

అవకాడో, గ్రెయిన్స్​ తింటే మంచిది. వయసు పైబడి నవారిలో అవకాడో బాగా పనిచేస్తుంది. మెదడు, కంటిచూపు, ఆరోగ్యం బాగా ఉంటుంది. మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. కాలీఫ్లవర్​, మొలకెత్తిన విత్తనాలు మెదడకు కావాల్సిన శక్తిని ఇవ్వడమే కాకుండా శరీర వ్యవస్థ మెరుగ్గా ఉండేందుకు సహాయపడతాయి.

ఆరెంజ్​, గ్రేప్స్​లో విటమన్​ సీ బాగా ఉంటుంది. ఇవి మెమరీ పవర్​ను పెంచుతాయి. ఈ రకమైన డైట్స్​ టిప్స్​ ఫాలో అయితే మనలో తప్పనిసరిగా ఏకాగ్రత మెరుగుపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: దోమలు కుడితే ఎయిడ్స్​ వస్తుందా?

Last Updated :Aug 21, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.