Good Relationship tips: అతి చనువు వద్దు.. అలాగని మాట్లాడకుండా ఉండొద్దు.!

author img

By

Published : Oct 6, 2021, 10:35 AM IST

good relationship with neighbours

వసుధ వాళ్ల పక్క పోర్షన్​లోకి కొత్తగా దిగారు ఓ నూతన జంట. కొత్త కదా పరిచయం పెంచుకుందామని వసుధ.. వాళ్లింట్లోకి వెళ్లింది. నూతన వధువును పరిచయం చేసుకుంది. అసలే బిడియంగా ఉన్న ఆ అమ్మాయితో వాళ్ల ఇంటి విషయాలన్నీ ఆరా తీసింది. దీంతో ఆ అమ్మాయి.. వసుధతో దూరంగా ఉండటం మొదలుపెట్టింది. అసలే నగర జీవితం.. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు తగ్గిపోతే జీవితం యాంత్రికంగా మారుతుంది. అందుకే హద్దులు దాటకుండా.. సరిహద్దులు పెట్టుకుంటే ఈ బంధ(Good Relationship tips)మైనా కలకాలం ఉంటుంది.

పక్కింటి వారితో అతి చనువూ తప్పే. అసలు మాట్లాడకున్నా కష్టమే. మరి ఇరుగు పొరుగుతో చెలిమిని నిలుపుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ సూత్రాలు(Good Relationship tips) పాటించండి మరి...

పొరుగింట్లోకి కొత్తగా వచ్చిన వారిని మీరే పలకరించండి. ఆరోజు సర్దుకోవడంలో హడావుడిగా ఉంటారు కనుక భోజనం(Good Relationship tips) ఏర్పాటు చేయండి. మీరే అద్దెకు దిగితే మీరే చొరవ తీసుకుని మాట కలపండి.

* వారి గురించి బాగా తెలిసేంత వరకూ అతి మామూలు విషయాలు(Good Relationship tips) మాట్లాడండి. వివాదాస్పదం అనిపించే మాటలొద్దు. అలాంటివి ఎప్పుడూ మంచిది కాదు.

* లోనికి రమ్మంటే దాన్ని హోమ్‌ టూర్‌ అనుకుని ప్రతి గదీ, ప్రతి వస్తువూ చూడాలనుకోకండి. హాల్లోనే రెండు మాటలు మాట్లాడి వచ్చేయండి.

* ప్రతి ఒక్కరూ కాస్త గోప్యత కోరుకుంటారు కనుక వ్యక్తిగత విషయాలను ఆరా తీయకండి. అడిగితేనే సలహాలు ఇవ్వండి. మీ సొంత విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం కూడా ఇవ్వకండి.

* మీ కుటుంబసభ్యుల చెప్పులు ఎదురింటి వరకూ పాకకుండా చూడండి. ప్రతిదానికీ హద్దులూ సరిహద్దులూ(Good Relationship tips) ఉంటాయి.

ఇదీ చదవండి: engili pula bathukamma 2021: సింగిడిలోని రంగులు.. తీరొక్క పూలతో కొలిచే బతుకమ్మ.. అచ్చమైన ప్రకృతి పండుగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.