ETV Bharat / lifestyle

'ఆ ఉత్సాహం క్రమేపీ ఎందుకు తగ్గిపోతోంది'

author img

By

Published : Sep 14, 2021, 2:01 PM IST

సౌజన్య కాలేజీలో చేరేటప్పుడు ఎన్నో లక్ష్యాలతో ఉండేది. చాలా కలలు కనేది. అయితే ఆ ఉత్సాహం క్రమేపీ ఎందుకు తగ్గిపోతోందో ఆమెకే తెలియడం లేదు. ఇటువంటి సమస్యకు కొన్ని కారణాలున్నాయంటున్నారు మానసిక నిపుణులు. దానికి పరిష్కారాలనూ సూచిస్తున్నారు.

goal
goal

* లక్ష్య సాధనను మధ్యలో వదిలేయకూడదు. అడ్డంకులెన్నెదురైనా దాటి ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి.అధైర్యపడితే విజయాన్ని పొందడం కష్టతరమవుతుంది. దాంతో లక్ష్యం బలహీనపడుతుంది.

* వాయిదా పద్ధతి అలవాటుంటే దాన్ని దూరంగా ఉంచాలి. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయడానికి కృషి చేయాలి. అప్పుడే.. తర్వాతి అడుగు వేయగలరు.

* లక్ష్యాన్ని చేరుకోవాలనే బలమైన నిర్ణయం మనసు నుంచి దూరమవకూడదు. అలాగే నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే చాలు. ఆసక్తి పెరుగుతుంది. అనుకున్నది సునాయసంగా సాధించొచ్చు.

* ఎప్పటికప్పుడు దక్కించుకున్న చిన్నచిన్న విజయాలకు మనకు మనమే ప్రశంసించుకోవాలి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందేలా చేస్తుంది. ముందుకు వెళ్లడానికి ప్రోత్సాహకరంగా మారుతుంది.

* ఒక పుస్తకంలో నిర్దేశించుకున్న మార్గాన్ని రాసి ఉంచుకోవాలి. దాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఎదురైన విజయాలు, వైఫల్యాలు వంటివన్నీ అందులో పొందుపరుస్తూ ఉండాలి. వీటిని చదివిన ప్రతిసారీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సాధించడానికి ఇంకెంతో దూరం లేదనే భావన మనసులో కలుగుతుంది.

ఇదీ చూడండి: Shruthi Hassan: నేనూ సగటు ఆడపిల్లలాగనే కదా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.