ETV Bharat / jagte-raho

దారుణం: ఇచ్చిన డబ్బు అడిగినందుకు హత్య

author img

By

Published : Nov 2, 2020, 4:14 PM IST

ఇచ్చిన డబ్బు అడిగినందుకు గొంతునులిమి హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. తీసుకున్న డబ్బు ఇస్తానని చెప్పి.. తాను అనుకున్న స్థలానికి రప్పించుకుని గొంతు నులిమి చంపాడు. ఈ హత్యలో అతనికి మరొకరు సహకరించారు. అనంతరం ఇద్దరు కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. కానీ పక్కా సమాచరంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. నిందితులను అరెస్టు చేశారు.

దారుణం: ఇచ్చిన డబ్బు అడిగినందుకు హత్య
దారుణం: ఇచ్చిన డబ్బు అడిగినందుకు హత్య

జగిత్యాల జిల్లా కేంద్రం వాణినగర్‌కు చెందిన తీపిరెడ్డి గంగారెడ్డి.. నరేశ్‌ అనే వ్యక్తికి డబ్బు ఇచ్చాడు. తర్వాత కొద్దిరోజులకు ఇచ్చిన డబ్బు అడగ్గా.. నరేశ్​ ఇవ్వలేదు. దీంతో గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మంచినీళ్ల బావి సమీపం వద్దకు డబ్బు ఇస్తామని గంగారెడ్డిని పిలిచి నరేశ్‌ గొంతునులిమి హత్యచేశాడు. నరేశ్‌కు మరో వ్యక్తి సహకరించాడు. హత్య చేసిన అనంతరం పూడ్చిపెట్టారు.

పూడ్చిపెట్టిన మృతదేహాన్ని సీఐ జయేశ్​ రెడ్డి వెలికితీశారు. వారికి అందిన పక్కా సమాచారంతోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని కనిపెట్టామని జయేశ్​ రెడ్డి తెలిపారు. నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: దారుణం.. ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.