ETV Bharat / jagte-raho

నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకును మోసం చేసిన ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Oct 1, 2020, 8:03 AM IST

నకిలీ పత్రాలతో రత్నాకర్ బ్యాంకును మోసం చేసిన ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధుకర్ రెడ్డి, మోయిజ్ పాషాను రిమాండ్​కు తరలించారు.

Two arrested for creating to fake documents
నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకును మోసం చేసిన ఇద్దరు అరెస్ట్​

భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకును మోసం చేసిన ఇద్దరిని హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మధుకర్ రెడ్డి, మోయిజ్ పాషను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

అసలేమైందంటే..

దంపతులైన వినోద, మధుకర్ రెడ్డి... అర్జున్ పౌల్ట్రీ ఫామ్ పేరుతో రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్​లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికోసం బాల్ రెడ్డి, మోయిజ్ పాషా, నర్సింహారెడ్డితో కలిసి నకిలీ పత్రాలు సృష్టించారు. ఇబ్రహీంపట్నంలోని శేరిగుడలో రెండెకరాల భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి... ఐదేళ్ల క్రితం ఆర్బీఎల్​లో రూ.3.7 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తంలో 2.7 కోట్లు తిరిగి చెల్లించకుండా బకాయిపడ్డారు.

దీనిపై ఆర్బీఎల్ ప్రతినిధులు అంతర్గత విచారణ చేపట్టగా... నకిలీ పత్రాలు పెట్టి బ్యాంకును మోసం చేసినట్లు గుర్తించారు. సీసీఎస్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల బియ్యం​ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.