ETV Bharat / jagte-raho

జగిత్యాల యాసిడ్ దాడి కేసులో ముగ్గురు అరెస్ట్‌

author img

By

Published : Dec 25, 2020, 10:12 PM IST

రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో స్వాతి అనే మహిళపై యాసిడ్ దాడి ఘటనలో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. స్వాతితో సన్నిహితంగా ఉండే గజేంద్ర అనే వ్యక్తే ప్రధాన సూత్రధారుడు అని తేల్చేశారు. ఆమె ఫోన్ తరచూ బిజీ రావడంతో అనుమానంతో పగ పెంచుకున్న గజేంద్ర.. తన మిత్రునితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

three persons arrest in jagtial acid attack case
జగిత్యాల యాసిడ్ దాడి కేసులో ముగ్గురు అరెస్ట్‌

జగిత్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం మహిళపై జరిగిన యాసిడ్ దాడి కేసును పోలీసులు ఛేదించారు. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాకు చెందిన స్వాతి అనే మహిళపై యాసిడ్ దాడి ఘటనలో ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ మేరకు మెట్‌పల్లి డీఎస్పీ కార్యాలయంలో జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ ముగ్గురు నిందితుల వివరాలు తెలిపారు.

అనుమానంతో..

ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన గజేంద్ర వద్దకు అప్పుడప్పుడు వ్యవసాయ పనులకు స్వాతి పోయేదని.. ఈ సమయంలో స్వాతితో గజేంద్రకు సాన్నిహిత్యం ఏర్పడిందని ఎస్పీ తెలిపారు. ఇలా పలుమార్లు స్వాతికి గజేంద్ర ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు స్వాతి ఫోన్ బిజీ రావడంతో అనుమానంతో పగ పెంచుకున్నాడు.

గజేంద్ర తన స్నేహితుడు దినేష్‌తో కలిసి స్వాతిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ ప్రకాష్ అనే మరో వ్యక్తితో రూ.10 వేలకు స్వాతిపై యాసిడ్ పోయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. యాసిడ్‌ను మెట్‌పల్లిలోని ఓ బ్యాటరీ షాపులో కొనుగోలు చేశారు. రెండు రోజుల క్రితం స్వాతి ఇంట్లో శుభకార్యం ఉండడంతో షాపింగ్ చేసేందుకు స్వాతిని ఒకరోజు ముందు మెట్‌పల్లికి గజేంద్ర తన కారులో తీసుకెళ్లాడు. షాపింగ్ ముగిశాక తిమ్మాపూర్ తండా బస్‌స్టాప్‌కు కొద్ది దూరంలో దింపాడు. పథకం ప్రకారం ఆ ఇద్దరు వ్యక్తులతో దాడి చేపించి.. ఏమీ తెలియనట్టు ఉన్నాడని పోలీసులు తెలిపారు.

స్వాతిపై యాసిడ్ దాడి జరగడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ప్రణాళికతో స్వాతి కాల్ డేటాతో ముగ్గురు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులను చేధించి పట్టుకున్న పోలీసులను ఎస్పీ సింధు శర్మ అభినందించారు. బాధితురాలి చికిత్సకు కావల్సిన పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి: హైదరాబాద్‌ మీదుగా తరలిస్తోన్న గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.