ETV Bharat / jagte-raho

యువకుడి హత్య కేసులో ఐదుగురు అరెస్ట్​

author img

By

Published : Jun 4, 2020, 7:49 PM IST

పాతబస్తీ యువకుడి హత్య కేసును దక్షిణ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్​ చేశారు.

Hyderabad latest news
Hyderabad latest news

హైదరాబాద్​ పాతబస్తీలో పాత కక్షల కారణంగా యువకుడిని హత్య చేసిన కేసులో దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కాలాపత్తర్​కు చెందిన షేక్ మహమ్మద్ ఐదు రోజుల క్రితం మీర్ ఆలం ట్యాంకు సమీపంలో హత్యకు గురయ్యాడు.

అతని స్నేహితుడు సాజిత్​తో పాటు మరో ఐదుగురు కలిసి హత్యచేసినట్లు గుర్తించిన పోలీసులు.. వాళ్లను అరెస్ట్ చేశారు. నిందితులంతా కూడా కాలాపత్తర్ ప్రాంతానికే చెందినవారేనని టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి తెలిపారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.