ETV Bharat / jagte-raho

నందకం అతిధి గృహం లిఫ్ట్​లో ప్రమాదం..ఒకరికి తీవ్రగాయాలు

author img

By

Published : Nov 11, 2020, 6:28 PM IST

లిప్ట్ నుంచి జారి కిందకు పడిపోవటంతో...ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన తిరుమల నందకం అతిథి గృహంలో జరిగింది.

నందకం అతిధి గృహం లిఫ్ట్​లో ప్రమాదం..ఒకరికి తీవ్రగాయాలు
నందకం అతిధి గృహం లిఫ్ట్​లో ప్రమాదం..ఒకరికి తీవ్రగాయాలు

తిరుమల నందకం అతిథి గృహంలో లిఫ్ట్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. నందకంలోని అతిథి గృహంలోని లిఫ్ట్​లో ఆరుగురు భక్తులు కిందికి దిగుతుండగా కరెంట్ పోయింది. దీంతో భక్తులను బయటికి తీసేందుకు లిఫ్ట్ ఆపరేటర్ తలుపులను తెరవగా...ఐదుగురు భక్తులు సురక్షితంగా బయటికి వచ్చేశారు.

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా వెంకటిగిరికి చెందిన జయప్రకాశ్ శెట్టి అనే భక్తుడు పొరపాటున కాలు జారి కిందకు పడిపోవటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: కొరియా కంపెనీలకు రెడ్ కార్పెట్ వేస్తాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.