ETV Bharat / jagte-raho

పతంగి ఎగురవేస్తుండగా.. చిన్నారికి కరెంటు షాక్‌

author img

By

Published : Oct 8, 2020, 3:59 PM IST

జవహర్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అరుంధతి నగర్​లో ఓ బాలుడు పతంగి ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్ తగిలింది. దీనితో ఆ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.

Serious injuries to a child with electric shock while flying a kite
పతంగి ఎగురవేస్తూ కరెంటు షాక్‌తో చిన్నారికి తీవ్రగాయాలు

హైదారాబాద్ జవహర్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అరుంధతినగర్​లో 7 సంవత్సరాల బాలుడు నిఖిల్​ గాలిపటం ఎగురవేస్తుండటంతో ప్రమాదవశాత్తు విద్యుత్​ తీగ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. పతంగి కరెంటు తీగలను చుట్టుకున్న ఆ క్రమంలో దానిని తీసే క్రమంలో కరెంట్​ షాక్​ తగిలింది. ఈ ప్రమాదంలో బాలుడి తల, మొహం, ఛాతి కాలిపోయింది.

గమనించిన తల్లి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తండ్రి రాజు 2 సంవత్సరాల క్రితం చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. బాలుని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి: కరోనాపై పోరుకు కృతజ్ఞతగా యోధులపై పూలవర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.