ETV Bharat / jagte-raho

పోలీసు తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

author img

By

Published : Nov 13, 2020, 2:44 PM IST

ఏపీలోని కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

blasting material seized
పోలీసు తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా తలమంచిపట్నంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి వైపు నుంచి జమ్మలమడుగు వెళ్తున్న వాహనంలో 986 జిలెటిన్ స్టిక్స్ , 400 డిటోనేటర్లను గుర్తించారు.

ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ మంజునాథ్ రెడ్డి చెప్పారు. నిందితులిద్దరూ జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామానికి చెందిన వారని తెలిపారు.

ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.