ETV Bharat / jagte-raho

భార్యను చూడటానికి వెళ్లి.. మరదలిపై అత్యాచారం

author img

By

Published : Oct 9, 2020, 12:33 PM IST

గర్భవతి అయిన భార్యను చూడడానికి అత్తగారింటికి వెళ్లిన ఓ వ్యక్తి.. మరదలిపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్​ పాతబస్తీ రైన్​ బజార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Man Raped Sister in law Since four Months.. case Filed in old city
భార్యను చూడటానికి వెళ్లి.. మరదలిపై అత్యాచారం

గర్భవతి అయిన భార్యను చూడడానికి అత్తగారింటికి వెళ్లి.. అక్కడ మరదలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. పాతబస్తీకి చెందిన షేక్​ వాహిద్​ వెల్డింగ్​ పని చేస్తాడు. భార్య గర్భం దాల్చగా.. పుట్టింటికి పంపాడు. అప్పుడప్పుడు ఆమెను చూడడానికి అత్తగారింటికి వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో వాహిద్​ కన్ను భార్య చెల్లిపై పడింది.

అదును చూసి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పొద్దని బెదిరించాడు. భయపడిన బాధితురాలు.. ఎవరికీ చెప్పలేదు. అదే అలుసుగా తీసుకొని నాలుగు నెలలుగా నిత్యం ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. కొన్నిరోజులుగా బాధితురాలి ఆరోగ్యం బాగుండటం లేదు. ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షల్లో ఆమె గర్భం దాల్చినట్టు తేలింది. విషయం ఆరా తీయగా.. బాధితురాలు జరిగిన సంగతి తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు బాధితురాలిని తీసుకెళ్లి రైన్​ బజార్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:హద్దులు గుర్తించినా.. పరిరక్షణ చర్యలు కరవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.