ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో కుమార్తెను కొట్టి చంపిన తండ్రి

author img

By

Published : Dec 5, 2020, 1:10 PM IST

father-hits-his-daughter-in-when-he-take-alcohol-and-she-died
మద్యం మత్తులో కుమార్తెను కొట్టి చంపిన తండ్రి

అతనికి ఉన్న మద్యం అలవాటు... ప్రేమగా పెంచుకుంటున్న కూతురినే కడతేర్చేలా చేసింది. నిత్యం మద్యం సేవించి భార్యతో గొడవపడే అతను... క్షణికావేశంలో తన ఐదేళ్ల కూతురిని నేలకేసి కొట్టగా... ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

నిర్మల్ జిల్లా అనంతపేటలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఓ వ్యక్తి కన్న కూతుర్నే కడతేర్చాడు. వినీష్ అనే వ్యక్తి రోజు మద్యం సేవించి...భార్యతో గొడవపడుతుండేవాడు. శుక్రవారం రాత్రి భార్యతో గొడవపడిన వినీష్‌... మద్యం మత్తులో కోపంతో కుమార్తె నిత్యను నేలకేసికొట్టాడు. చిన్నారికి బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంలోనే ప్రాణాలు కోల్పోయింది. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: మానసిక ఒత్తిడితో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.