ETV Bharat / jagte-raho

ప్రభుత్వం భూమి లాక్కుందని రైతు ఆత్మహత్య

author img

By

Published : Jul 30, 2020, 12:45 PM IST

తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని రైతు వేదిక నిర్మాణం కోసం ప్రభుత్వం లాకుందనే... మనస్థాపంతో సిద్దిపేట వర్గల్ మండలం వేలూరులో నర్సింహా అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాద్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మృతుని బంధువులు సర్పంచ్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.

farmer suicide with government land pooling in veluru
ప్రభుత్వం భూమి లాక్కుందని రైతు ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరుకు చెందిన బ్యాగరి నరసింహ (35) అనే రైతుకు చెందిన 13 గుంటల వ్యవసాయ భూమి ఉంది. తాతల నుంచి వారసత్వంగా వచ్చింది. ఈ భూమి గతంలో ప్రభుత్వం వీరికి అసైన్డ్ చేసి ఇచ్చింది. 15 రోజుల క్రితం రైతు వేదిక నిర్మాణం కోసం... ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు భూమిపూజ చేశారు. తన భూమిని లాక్కోవద్దంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది.

భూమి పోతుందన్న మనస్థాపంతో పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించిందని వైద్యులు సూచించగా... సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుని బంధువులు సర్పంచ్​ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా వినకుండా ఆందోళన కొనసాగించారు.

ఆగ్రహించిన మృతుని బంధువులు కుటుంబ సభ్యులు స్థానిక సర్పంచ్ ముందుకు వెళ్లి ఆందోళన చేపట్టారు బాధితుల పై చర్యలు తీసుకోవడంతో పాటు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చచెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నారు బంధువులు ఎంత చెప్పినా వినకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వం భూమి లాక్కుందని రైతు ఆత్మహత్య

ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.